న‌మో వెంక‌టేశా.. వ‌ర‌స సినిమాల‌తో ర‌చ్చ.

సీనియ‌ర్ హీరోకు మ‌ళ్లీ జోష్ వ‌చ్చింది. ఒకేసారి నాలుగు సినిమాలు క‌న్ఫ‌ర్మ్ చేసాడు వెంక‌టేశ్. ఇప్పుడు ఈయ‌న తీరు జోరు చూస్తుంటే షాక్ త‌ప్ప‌దు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా నాలుగు సినిమాలు చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తోన్న ఎఫ్ 2 షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది.

venkatesh

ఈ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ తో క‌లిసి న‌టిస్తున్నాడు వెంక‌టేశ్. ఇదిలా ఉంటే న‌వంబ‌ర్ నుంచి నాగ‌చైత‌న్య‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌బోతున్నాడు వెంకీ. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కించ‌నున్నాడు. వెంకీ మామా టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో నిజంగానే మామ అల్లుళ్లుగా న‌టించ‌బోతున్నారు వెంక‌టేశ్, చైతూ. ఇక దాంతోపాటే త్రినాథ‌రావ్ న‌క్కిన‌తోనూ ఓ సినిమాకు క‌మిట‌య్యాడు వెంక‌టేశ్. ఈ చిత్రం డిసెంబ‌ర్ లో ప‌ట్టాలెక్క‌నుంది. దాంతో రానాతోనూ ఓ మ‌ల్టీస్టార‌ర్ చేస్తాడ‌ని సురేష్ బాబు క‌న్ఫ‌ర్మ్ చేసాడు. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే వెంకీ అట్లూరితో కూడా సినిమాలు చేయ‌బోతున్నాడు వెంక‌టేశ్. ఇలా ఒకేసారి నాలుగు సినిమాలు క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఇవ‌న్నీ వ‌చ్చే రెండేళ్ల‌లో పూర్తి చేయ‌డానికి చూస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here