క‌లిసొచ్చిన హీరోను న‌మ్ముకుంటున్న వినాయ‌క్..

వినాయ‌క్ మనసు మార్చుకున్నాడా.. లేదంటే బాలయ్య నమ్ముకుంటే పని జరగదని ఫిక్స్ అయిపోయాడా.. అందుకే ఇప్పుడు మరో హీరో కోసం ప్రయత్నిస్తున్నాడా.. ఏమో ఇప్పుడు ఇవే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇండ‌స్ట్రీలో. నిజంగానే వినాయ‌క్ ఇప్పుడు బాలయ్యను నమ్ముకోవడం మానేశాడు. తర్వాత సినిమా కోసం మరో హీరో లైన్ లోకి వచ్చాడు.

Hero venkatesh Accepts Next Movie With VV Vinayak

ఆయన ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. కుర్ర హీరోలు నమ్ముకుంటే పని జరగదు అని ఫిక్స్ అయిపోయిన‌ వినాయక్ ఆ త‌ర్వాతే బాల‌య్య‌కు క‌థ‌ చెప్పి ఒప్పించాడు. కానీ ఆయన కూడా ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు బోయపాటి శ్రీను సినిమాతో బిజీ అయిపోయాడు. దాంతో తన తర్వాత సినిమాలో వెంకటేష్ తో ప్లాన్ చేస్తున్నాడు ఈ మాస్ డైరెక్టర్. త్వరలోనే ఈ సినిమాపై క్లారిటీ రానుంది. వెంకీ ప్రస్తుతం ఎఫ్ 2 ప్రమోషన్స్ తో పాటు బాబీ దర్శకత్వంలో వెంకీ మామ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రం అనుకున్నట్లుగా ఇప్పుడు సెట్స్ పైకి రావడం కష్టమే.

అందుకే ఈయన కూడా పక్కనపెట్టి వినాయ‌క్ సినిమాతో బిజీ కావాలని చూస్తున్నాడు. ఈ కాంబినేష‌న్ లో 12 ఏళ్ల కింద‌ లక్ష్మీ సినిమా వచ్చింది. అది అప్పట్లో బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత వినాయ‌క్-వెంకటేష్ కాంబినేషన్ కలుస్తుందని వార్త అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు.. ఇందులో హీరోయిన్ ఎవరు ఇవన్నీ త్వరలోనే తేలనున్నాయి. ఏదేమైనా ఇన్నాళ్ల తర్వాత వినాయ‌క్ మరో హీరోను పట్టుకున్నాడు. మరి ఈ సినిమా అయినా సెట్స్ పైకి వెళుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here