సుమంత్ ఆ బాకీ తీర్చుకుంటాడా..?

గ‌తేడాది మ‌ళ్లీ రావా అనే సినిమా వ‌చ్చిన‌పుడు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. తీరా అది థియేట‌ర్స్ నుంచి బ‌య‌టికి వ‌చ్చిన త‌ర్వాత బాగుంది బాగుంది అంటూ ప్ర‌మోట్ చేసారు. అప్ప‌టి వ‌ర‌కు సుమంత్ అనే హీరో ఇంకా సినిమాలు చేస్తున్నాడ‌నే సంగ‌తి కూడా చాలా మందికి తెలియ‌దు. ఆయ‌న రిటైర్మెంట్ తీసుకున్నాడేమో అనుకున్నారు. కానీ మ‌ళ్లీరావా త‌ర్వాత తాను ఇంకా ఉన్నాన‌ని గుర్తు చేసాడు.

Hero sumanth Upcoming movies

అప్పుడు ప్ర‌శంస‌ల వ‌రకు వెళ్లి క‌మ‌ర్షియ‌ల్ విజ‌యానికి దూరంగా ఉన్న సుమంత్.. ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చేయాల‌ని చూస్తున్నాడు. మ‌ళ్లీ రావా ఇచ్చిన స్పూర్థితోనే ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు సుమంత్. ఇందులో సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం సినిమా డిసెంబ‌ర్ 7న వ‌స్తుంది. ఈ చిత్రాన్ని కొత్త ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్ల‌మూడి తెర‌కెక్కించాడు.

ఇది స‌మంత్ కు 25వ సినిమా కావ‌డం మ‌రో విశేషం. సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి గుడి చుట్టూ తిరిగే క‌థ‌తో వ‌స్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఏదో అల్లాట‌ప్పాగా తీసిన క‌థ‌లా మాత్రం క‌నిపించ‌డం లేదు. క‌చ్చితంగా సుమంత్ ఇప్పుడు క‌సిమీదున్నాడ‌ని అర్థ‌మైపోతుంది.

ఈ సినిమాతో పాటు ఇదం జ‌గ‌త్ అనే మ‌రో సినిమా కూడా చేస్తున్నాడు స‌మంత్. ఇక ఈ రెండూ కాకుండా ఎన్టీఆర్ బ‌యోపిక్ లో ఏఎన్నార్ గా న‌టిస్తున్నాడు ఈ హీరో. మ‌రి చూడాలిక‌.. ఇప్పుడు సుమంత్ కెరీర్ ఎటు వెళ్ల‌నుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here