పిచ్చ హాట్ గా హ‌లో గురు ప్రేమ‌కోస‌మే టీజ‌ర్.. 

ఉన్న‌ట్లుండి రూట్ మార్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్. ఇన్నాళ్ళూ హోమ్లీ ఇమేజ్ తోనే బండి లాక్కొచ్చింది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఇప్పుడు సడ‌న్ గా ప్లేట్ మార్చేసింది. హ‌లో గురు ప్రేమ‌కోస‌మే టీజ‌ర్ లో హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది.

ప‌ద్ద‌తిగానే క‌నిపిస్తూ ప్రాణాలు తీసేసింది ఈ ముద్దుగుమ్మ‌. రామ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్ర టీజ‌ర్ విడుద‌లైంది. హీరోకు రెండు ఫ్లాపులు.. నిర్మాత‌కు రెండు ఫ్లాపులు.. హీరోయిన్ కు అయితే వ‌ర‌స ఫ్లాపులు.. కానీ అంద‌ర్నీ బ్యాలెన్స్ చేసే ద‌ర్శ‌కుడికి మాత్రం వ‌ర‌స‌గా రెండు విజ‌యాలు.

ఇదే ఇప్పుడు హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సినిమా ఈక్వెష‌న్. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ తో బిజీగా ఉంది టీం. ఈ చిత్రంలో ప్ర‌ణీత రెండో హీరోయిన్ గా న‌టిస్తుంది. రెండేళ్ల త‌ర్వాత తెలుగులో న‌టిస్తుంది ఈ భామ‌. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రంపైనే ఇప్పుడు దిల్ రాజు ఆశ‌ల‌న్నీ ఉన్నాయి. దానికి కార‌ణం వ‌ర‌స ఫ్లాపులే. ఈ చిత్రం పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీగా రూపొందుతుంది. టీజ‌ర్ చూస్తుంటేనే అర్థ‌మైపోతుంది సినిమాలో ఎంత రొమాన్స్ ఉండ‌బోతుందా అని..?

నేనులోక‌ల్.. సినిమా చూపిస్తా మావా త‌ర‌హాలోనే మ‌రోసారి మామా అల్లుళ్ల కాన్సెప్ట్ నే ఇందులోనూ వాడుకుంటున్నారు త్రినాథ‌రావ్ న‌క్కిన అండ్ ప్ర‌స‌న్న కుమార్ బ్యాచ్. హైప‌ర్.. ఉన్న‌ది ఒకటే జిందగీ ఫ్లాప్ తో నిరాశ‌ప‌డిన రామ్ కు ఈ సినిమా కీల‌కంగా మారింది.

ఇక దిల్ రాజు కూడా ల‌వ‌ర్.. శ్రీ‌నివాస క‌ళ్యాణంతో ఫ్లాపులిచ్చాడు. పైగా సెట్లో వివాదాలు జ‌రుగుతున్నాయ‌ని.. కెమెరా మెన్ తో రామ్ కు ప‌డ‌టం లేద‌నే వాద‌న వినిపిస్తుంది. అయితే దిల్ రాజు ఏదో ఒక‌టి చేసి స‌ముదాయించాడు. మొత్తానికి అక్టోబ‌ర్ 18న ఈ చిత్ర విడుద‌ల ప్లాన్ చేస్తున్నారు. మ‌రి ఈ హ‌లో గురు ప్రేమ‌కోస‌మే ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *