రివ్యూ: హ‌లో గురు ప్రేమ‌కోస‌మే

CRITICS METER

Average Critics Rating: 3
Total Critics:1

AUDIENCE METER

movie-poster
Release Date

Critic Reviews for The Boxtrolls

హ‌లో గురు ప్రేమ‌కోస‌మే.. రొటీన్ క‌థ ఖాయ‌మే..
Rating: 2.5/5

www.teluguodu.com

రివ్యూ                   : హ‌లో గురు ప్రేమ‌కోస‌మే
న‌టీన‌టులు             : రామ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత‌, ప్ర‌కాశ్ రాజ్, మహేష్ ఆచంట, సితార, జయప్రకాశ్, పోసాని కృష్ణ మురళీ,
నిర్మాత‌లు               : దిల్ రాజు-శిరీష్-లక్ష్మ‌ణ్
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు : ప‌్ర‌స‌న్న కుమార్
ద‌ర్శ‌కుడు               : త‌్రినాథ‌రావ్ న‌క్కిన‌

సినిమా చూపిస్త మావా.. నేనులోక‌ల్ సినిమాల త‌ర్వాత త్రినాథ‌రావ్ న‌క్కిన తెర‌కెక్కించిన చిత్రం హ‌లో గురు ప్రేమ‌కోస‌మే. అందుకే ఈ చిత్రంపై అంత‌గా అంచనాలున్నాయి. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైనర్ గానే ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు త్రినాథ‌రావ్. మ‌రి ఆయ‌న అంచ‌నాల‌ను ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు నిల‌బెట్టింది చూద్దాం..!

క‌థ‌:
సంజు(రామ్) బిటెక్ పూర్తి చేసి ఖాళీగా ఉంటాడు. ఇంట్లోనే అమ్మానాన్న‌ల‌తో క‌లిసి ఉండ‌ట‌మే న‌యం అనుకుంటాడు. అలాంటి వాడికి వాళ్ల మావ‌య్య‌(పోసాని) వ‌చ్చి క్లాస్ పీక‌డంతో హైద‌రాబాద్ వ‌స్తాడు. అక్క‌డ సంజు వాళ్ల అమ్మ ఫ్రెండ్ విశ్వనాథ్ (ప్ర‌కాశ్ రాజ్) ఇంట్లో ఉంటాడు. అక్క‌డే వాళ్ళింట్లోనే ఉంటూ అమ్మాయి అను(అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్) ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ ఆమె మాత్రం అన్నింటికీ నాన్న అంటుంది. అప్పుడు ఏం జ‌రిగింది.. సంజు త‌న ప్రేమ‌ను ఎలా గెలిపించుకున్నాడు అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
కొన్ని సినిమాలు ఎలా ఉన్నాయి అని అడ‌క్కూడ‌దు.. అవి బాగుంటాయంతే. అలాగ‌ని అందులో కొత్త క‌థ ఉందా అని కూడా అడ‌క్కూడ‌దు. పాత క‌థ‌నే మ‌ళ్లీ కొత్త‌గా చెప్తారంతే. ఇందులో ఆరితేరిపోయారు త్రినాథ‌రావ్ న‌క్కిన‌-ప్ర‌స‌న్న కుమార్ జోడీ. ఒక‌ప్పుడు త్రివిక్ర‌మ్-విజ‌య్ భాస్క‌ర్ మాదిరి పాత క‌థ‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ తిప్పి చూపిస్తున్నారు ఈ జోడీ. ఇప్పుడు కూడా ఇదే చేసారు. సినిమా చూపిస్త మావా.. నేనులోక‌ల్ సినిమాలో మామ‌అల్లుడు క‌థ‌ను చూపించిన వీళ్లు.. మ‌రోసారి అదే క‌థ‌ను తిప్పి చూపించారు. కాక‌పోతే మ‌రింత ఎంట‌ర్ టైన్మెంట్ జోడించారంతే. ప్ర‌తీసారి అదే క‌థ‌ను చూపిస్తున్నా కూడా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డం కూడా గొప్ప విష‌య‌మే. ఇందులో ద‌ర్శ‌కుడిని మెచ్చుకోవ‌చ్చు. రామ్ తో పాటు అత‌డి చుట్టు ఉన్న పాత్ర‌ల‌ను డిజైన్ చేసిన విధానం అక్క‌డ‌క్క‌డ‌ న‌వ్వు తెప్పిస్తుంది.
ఏం చేసినా చివ‌రి ల‌క్ష్యం న‌వ్వించ‌డ‌మే అన్న‌ట్లుగా సాగింది క‌థ‌. హీరో ఇంట్రో నుంచి చివ‌రి వ‌ర‌కు నేనులోక‌ల్ గుర్తుకొస్తూనే ఉంటుంది కానీ కామెడీ కూడా వ‌స్తుంటుంది. ఫ‌స్టాఫ్ వ‌ర‌కు కామెడీగానే సాగిన క‌థ‌.. సెకండాఫ్ లో కాస్త గాడి త‌ప్పిన‌ట్లు అనిపిస్తుంది. అస‌లు క‌థే లేక‌పోవ‌డంతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. సెకండాఫ్ లో ప్ర‌కాశ్ రాజ్, రామ్ మ‌ధ్య వ‌చ్చే సీన్స్ అన్ని లాజిక్ లేకుండా అనిపిస్తాయి. ఎంత ఫ్రెండ్ గా మారినా కూడా తండ్రే త‌న కూతురుకు లైన్ వేసుకోడానికి ప‌ర్మిష‌న్ ఇస్తాడు అనేది లాజిక్ అనిపించ‌దు. ఓవరాల్ గా హ‌లో గురు ప్రేమ‌కోస‌మే కొత్త‌ద‌నం లేని మ‌రో రొటీన్ మామా అల్లుళ్ల క‌థ‌.

న‌టీన‌టులు:
రామ్ ఇలాంటి పాత్ర‌లు ఎన్నో చేసాడు. త‌న కెరీర్ లో సెటిల్డ్ రోల్స్ చేసింది త‌క్కువ కానీ ఇలాంటి పాత్ర‌లు మాత్రం బాగానే చేసాడు. ఇప్పుడు కూడా మ‌రోసారి ఎన‌ర్జిటిక్ రోల్ లో ఒదిగిపోయాడు. పైగా ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా ఉన్నాడు రామ్. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బాగానే చేసింది. తొలిసారి కాస్త హాట్ గా క‌నిపించింది. అందాలు చూపించ‌కుండానే రెచ్చ‌గొట్టింది. ఎందుకో తెలియ‌దు కానీ చీర‌క‌ట్టులోనే ఆ మాయ క‌నిపించింది. ఇక ప్ర‌ణీత మ‌రోసారి సెకండ్ లీడ్ గానే మిగిలిపోయింది. ఈమెకు పెద్ద‌గా చెప్పుకోద‌గ్గ పాత్రేమీ కాదు. టిపిక‌ల్ రెండో హీరోయిన్ పాత్ర అంతే. ప్ర‌కాశ్ రాజ్ కారెక్ట‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. చాలా వ‌ర‌కు బాగా న‌వ్వించాడు కూడా.

టెక్నిక‌ల్ టీం:
దేవీ శ్రీ ప్ర‌సాద్ పాట‌లు ప‌ర్లేదు. రామ్ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఇందులో పాట‌లు కాస్త త‌గ్గాయి. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. పైగా పెద్ద పెద్ద క‌ళ్లు.. టైటిల్ సాంగ్.. ప్రెండు పాట‌లు తెర‌పై బాగున్నాయి. విజ‌య్ కే చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ అదిరిపోయింది. కార్తిక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఓకే. కాస్త అక్క‌డ‌క్క‌డా మ‌రీ రొటీన్ సీన్స్ ప‌డ్డాయి. ప్ర‌స‌న్న కుమార్ ఈసారి త‌న డైలాగ్ ప‌వ‌ర్ చూపించ‌లేక‌పోయాడు. కామెడీ కూడా ముందు సినిమాల‌తో పోలిస్తే పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. త్రినాథ‌రావ్ మ‌రోసారి పాత‌క‌థ‌నే కాస్త ఎంట‌ర్ టైనింగ్ గా చెప్పారు. కానీ ఇదే ట్రెండ్ ఫాలో అయితే ఎక్క‌డో ఓ చోట బొక్క‌బోర్లా ప‌డ‌టం ఖాయం.

చివ‌ర‌గా:
హ‌లో గురు ప్రేమ‌కోస‌మే.. రొటీన్ క‌థ ఖాయ‌మే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here