హ‌లో గురు ఫ్లాప్ దాటాలి.. దాటి చూపించాలి

హీరోకు రెండు ఫ్లాపులు.. నిర్మాత‌కు రెండు ఫ్లాపులు.. హీరోయిన్ కు అయితే వ‌ర‌స ఫ్లాపులు.. కానీ అంద‌ర్నీ బ్యాలెన్స్ చేసే ద‌ర్శ‌కుడికి మాత్రం వ‌ర‌స‌గా రెండు విజ‌యాలు. ఇదే ఇప్పుడు హ‌లో గురు ప్రేమ‌కోస‌మే సినిమా ఈక్వెష‌న్. ప్ర‌స్తుతం ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. రీ షూట్ కూడా చేయించి ముస్తాబు చేసాడు దిల్ రాజు. రామ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా త్రినాథ‌రావ్ న‌క్కిన తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ప్ర‌ణీత రెండో హీరోయిన్ గా న‌టించింది. రెండేళ్ల త‌ర్వాత తెలుగులో న‌టించింది ఈ భామ‌. దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంపైనే ఇప్పుడు దిల్ రాజు ఆశ‌ల‌న్నీ ఉన్నాయి.

HELLO GURU PREMA KOSAME
దానికి కార‌ణం వ‌ర‌స ఫ్లాపులే. ఈ చిత్రం పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీగా రూపొందింది. నేనులోక‌ల్.. సినిమా చూపిస్తా మావా త‌ర‌హాలోనే మ‌రోసారి మామా అల్లుళ్ల కాన్సెప్ట్ నే ఇందులోనూ వాడుకుంటున్నారు త్రినాథ‌రావ్ న‌క్కిన అండ్ ప్ర‌స‌న్న కుమార్ బ్యాచ్. హైప‌ర్.. ఉన్న‌ది ఒకటే జిందగీ ఫ్లాప్ తో నిరాశ‌ప‌డిన రామ్ కు ఈ సినిమా కీల‌కంగా మారింది. ఇక దిల్ రాజు కూడా ల‌వ‌ర్.. శ్రీ‌నివాస క‌ళ్యాణంతో ఫ్లాపులిచ్చాడు. పైగా సెట్లో వివాదాలు జ‌రుగుతున్నాయ‌ని.. కెమెరా మెన్ తో రామ్ కు ప‌డ‌టం లేద‌నే వాద‌న వినిపించింది. అయితే దిల్ రాజు ఏదో ఒక‌టి చేసి స‌ముదాయించాడు. మొత్తానికి అక్టోబ‌ర్ 18న రానున్న ఈ చిత్రం ఎంత‌వ‌ర‌కు రామ్, దిల్ రాజు, అనుప‌మ‌ను ఫ్లాపుల్లోంచి బ‌య‌ట ప‌డేస్తుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here