ఇంకా అదే క‌న్ఫ్యూజ‌న్ లో హ‌రీష్ శంక‌ర్..

ఏం త‌ప్పు చేసాడో తెలియ‌దు కానీ ఏడాదిన్న‌ర‌గా శిక్ష మాత్రం అనుభ‌విస్తూనే ఉన్నాడు హ‌రీష్ శంక‌ర్. ఈయ‌న కంటే దారుణ‌మైన ఫ్లాపులు ఇచ్చిన ద‌ర్శ‌కులు కూడా సినిమాలు చేస్తున్నారు కానీ ఈయ‌న మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈయ‌న్ని చూస్తుంటే పాపం అనిపించ‌క మాన‌దు. డిజే లాంటి 70 కోట్ల సినిమా ఇచ్చి కూడా ఖాళీగా ఉన్నాడు. దాగుడుమూత‌లు అనుకున్నా కూడా సెట్ కాలేదు.

Harish Shankar to Direct 96 Movie Remake

అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం మ‌ళ్లీ ఈయ‌న రీమేక్ సినిమాపైనే క‌న్నేసాడ‌ని తెలుస్తుంది. త‌మిళ‌నాట వ‌చ్చిన 96 సినిమాను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు రాజు.
విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా వ‌చ్చిన ఈ చిత్రానికి అక్క‌డ మంచి టాక్ వ‌చ్చింది. ఇప్పుడు తెలుగులో దీని బాధ్య‌త‌లు హ‌రీష్ శంక‌ర్ కు ఇస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్త‌న్నాయి.

ఎలాగూ హ‌రీష్ తో మూడు సినిమాలు చేసాడు దిల్ రాజు. పైగా రీమేక్ చేయ‌డంలో హ‌రీష్ ఎక్స్ ప‌ర్ట్ కూడా. అది గ‌బ్బ‌ర్ సింగ్ తోనే అర్థ‌మైపోయింది. ఇక ఇప్పుడు 96ని కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లుగా మార్చి రీమేక్ చేయ‌డానికి చూస్తున్నాడు హ‌రీష్. ఈ చిత్రంలో నాని అనుక‌న్నారు కానీ ఇప్పుడు ఈయ‌న ఇటు వైపు కూడా చూడ‌టం లేదు. బ‌న్నీ కూడా 96 క‌థ‌పై ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తుంది కానీ ఏమీ చెప్ప‌డం లేదు. దాంతో ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ గ‌మ్యం తెలియ‌ని ప్ర‌యాణం చేస్తూనే ఉన్నాడు. మ‌రి ఇది ఎక్క‌డొచ్చి ఆగుతుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here