హ‌రీష్ శంక‌ర్ మ‌ళ్లీ రీమేక్ ను న‌మ్ముకుంటున్నాడా..?

కొంద‌రు ద‌ర్శ‌కుల‌ను చూస్తుంటే అయ్యో పాపం అనాల‌నిపిస్తుంది. వాళ్లేం త‌ప్పు చేయ‌రు.. కానీ శిక్ష మాత్రం అనుభ‌విస్తూ ఉంటారు. ఇప్పుడు హ‌రీష్ శంక‌ర్ కూడా ఇదే కోవలోకి వ‌స్తాడు. దారుణ‌మైన ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన వాళ్లు కూడా మ‌రో సినిమా చేస్తూ హ్యాపీగా ఉన్నారు. కానీ హ‌రీష్ శంక‌ర్ మాత్రం డిజే లాంటి 70 కోట్ల సినిమా ఇచ్చి కూడా ఖాళీగా ఉన్నాడు. దాగుడుమూత‌లు అనుకున్నా కూడా సెట్ కాలేదు.

Harish Shankar Next Movie Conformed

అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం మ‌ళ్లీ ఈయ‌న రీమేక్ సినిమాపైనే క‌న్నేసాడ‌ని తెలుస్తుంది. త‌మిళ‌నాట వ‌చ్చిన 96 సినిమాను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు రాజు.
విజ‌య్ సేతుప‌తి, త్రిష జంట‌గా వ‌చ్చిన ఈ చిత్రానికి అక్క‌డ మంచి టాక్ వ‌చ్చింది. ఇప్పుడు తెలుగులో దీని బాధ్య‌త‌లు హ‌రీష్ శంక‌ర్ కు ఇస్తున్నాడ‌నే వార్త‌లు వినిపిస్త‌న్నాయి.

ఎలాగూ హ‌రీష్ తో మూడు సినిమాలు చేసాడు దిల్ రాజు. పైగా రీమేక్ చేయ‌డంలో హ‌రీష్ ఎక్స్ ప‌ర్ట్ కూడా. అది గ‌బ్బ‌ర్ సింగ్ తోనే అర్థ‌మైపోయింది. ఇక ఇప్పుడు 96ని కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌గ్గ‌ట్లుగా మార్చి రీమేక్ చేయ‌డానికి చూస్తున్నాడు హ‌రీష్. ఈ చిత్రంలో నాని హీరోగా న‌టించ‌బోతున్నాడ‌నే ప్ర‌చారం అయితే జ‌రుగుతుంది. అయితే అది ఎంత‌వ‌ర‌కు నిజం అనేది మాత్రం తేల‌డం లేదు. మొత్తానికి అటు ఇటు తిరిగి చివ‌రికి మ‌ళ్లీ దిల్ రాజుతోనే రీమేక్ సినిమాకు క‌మిట‌య్యాడు హ‌రీష్ శంక‌ర్. మ‌రి ఇది హ‌రీష్ కెరీర్ కు ఎంత‌వ‌ర‌కు యూజ్ అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here