హ్యాపీ బ‌ర్త్ డే ఇలియానా.. ఉంటావా వెళ్తావా..?

అవును.. న‌వంబ‌ర్ 1 ఇలియానా బ‌ర్త్ డే. ఆమెకు గ్రీటింగ్స్ చెబుతూనే ఇప్పుడు అబిమానులు ఈ ప్ర‌శ్న కూడా అడుగుతున్నారు. వ‌చ్చింది క‌దా.. మ‌ళ్లీ ఉంటుందా వెళ్లిపోతుందా అని. ఇప్పుడు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీలో ఆమె లుక్ చూసిన త‌ర్వాత ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. గోవా బ్యూటీ లుక్స్ అదిరిపోయాయంతే. అచ్చంగా హాలీవుడ్ హీరోయిన్ మాదిరే ఉంది ఇలియానా.

Ileana

అయినా రీ ఎంట్రీ ఇచ్చేవ‌ర‌కు ఓ అనుమానం.. ఇచ్చిన త‌ర్వాత మ‌రో అనుమానం. ఇప్పుడు ఇలియానా తెలుగు ఇండ‌స్ట్రీలోనే ఉంటుందా.. లేదంటే ర‌వితేజ సినిమాతో ఏదో చుట్ట‌పుచూపుగా న‌టించి వెళ్లిపోతుందా..? ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఇదే అనుమానం ఉంది. ఎంద‌కుంటే త‌మ సినిమాల్లోనూ ఇలియానాను తీసుకోవాలంటే ఆమె ఏం అంటుందో తెలియ‌క తిక‌మ‌క ప‌డుతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే ఇప్పుడు ఆమె ఉన్న రేంజ్ ను మ‌న నిర్మాత‌లు త‌ట్టుకుంటారా అనేది అనుమాన‌మే.
ఎందుకంటే అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కోసం ఖాళీగా ఉన్న ఇల్లీని తీసుకొచ్చి ఏకంగా రెండుకోట్లు చదివించుకున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్.

మ‌ళ్లీ అందులో హోట‌ల్ బిల్స్.. అమ్మ‌గారి సౌక‌ర్యాలు కూడా అద‌నం. అవ‌న్నీ కాకుండానే రెండు కోట్ల‌కు పైగా ఇలియానా రెమ్యున‌రేష‌న్. ఇదే అమౌంట్ ఇస్తే పాత ఇలియానా ఎందుకు.. కొత్త పూజాహెగ్డేలే ఎగురుకుంటూ వ‌స్తారు క‌దా అంటున్నారు కొంద‌రు నిర్మాత‌లు. మ‌రోవైపు గోవాబ్యూటీ కూడా ర‌వితేజ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ తెలుగు ఇండ‌స్ట్రీ వైపు వ‌చ్చే ఆలోచ‌న‌లు చేయ‌డం లేదు. బాలీవుడ్ లోనే త‌న జెండా అంటుంది ఈ బ్యూటీ. ఇప్ప‌టికే ముంబై వెళ్లి అక్క‌డే సెటిల్ అయిపోయింది గోవాభామ‌. ప్ర‌స్తుతం హిందీలో ఒక్క సినిమా కూడా ఇలియానా చేతుల్లో లేదు. కానీ ఖాళీగా ఉంటాను కానీ తెలుగు ఇండ‌స్ట్రీకి మాత్రం రానంటుంది ఈ ముద్దుగుమ్మ‌. న‌వంబ‌ర్ 16న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ విడుద‌ల కానుంది. అప్పుడు తెలుస్తుంది ఈ భామ చూపులు ఎక్క‌డున్నాయో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here