హ‌న్సిక సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఫ్యాన్స్ ఏమైపోతారో..?

హ‌న్సిక అంటే తెలుగులో ఎలాంటి ఇమేజ్ ఉందో తెలియ‌దు కానీ త‌మిళ‌నాట మాత్రం మంచి క్రేజ్ ఉంది. అక్క‌డ ఓ టైమ్ లో నెంబ‌ర్ వ‌న్ హీరోయిన్ గా కూడా ఉంది ఈ భామ‌. వ‌ర‌స‌గా స్టార్ హీరోల‌తో న‌టిస్తూ చ‌క్రం తిప్పింది. పైగా ఆమెకు గుడి కూడా క‌ట్టారు అభిమానులు. ఇదిలా ఉంటే ఇప్పుడు హ‌న్సిక ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై తాను అస్స‌లు ఎక్స్ పోజింగ్ చేయ‌న‌ని చెప్పింది హ‌న్సిక. హ‌న్సిక‌ అన‌గానే ప్రేక్ష‌కుల‌కు తెలియ‌కుండానే అంద‌మైన రూపం గుర్తొస్తుంది. ఆ రూపంలో బొద్దందాలే క‌ళ్ల ముందుకు వ‌స్తాయి. ఎందుకంటే కెరీర్ మొద‌ట్లో దేశ‌ముదురు.. కంత్రి మిన‌హా అన్నింట్లోనూ బొద్దుగానే క‌నిపించింది హ‌న్సిక‌. ఎప్ప‌టిక‌ప్పుడు బ‌రువు త‌గ్గాల‌ని చూసినా కూడా కుద‌ర్లేదు. పైగా అవ‌రోళ్ల‌కు బొద్దుగుమ్మలంటే బాగా ఇష్టం.

Hansika
దాంతో ఈ ముద్దుగుమ్మ‌కు అక్క‌డోళ్లు ఇట్టే క‌నెక్ట్ అయిపోయారు. ఆ త‌ర్వాత ఫిజిక్ పై హ‌న్సిక కూడా దృష్టి త‌గ్గించేసింది. మ‌రింత బ‌రువు పెరిగిపోయింది. పాతికేళ్ల‌కే ఆంటీలా మారిపోవ‌డంతో తెలుగులో అస‌లు అవ‌కాశాలు రావ‌డ‌మే క‌ష్ట‌మైపోయాయి. కానీ ఇప్పుడు మ‌ళ్లీ బ‌రువు త‌గ్గే ప‌నిలో బిజీ అయిపోయింది హ‌న్సిక‌. ఇక ఇప్పుడు హ‌న్సిక తీసుకున్న నిర్ణ‌యంతో ఆమె కెరీర్ ఎలాంటి వైపుకు ట‌ర్న్ తీసుకుంటుందో అర్థం కావ‌డం లేదు. పూర్తిగా బ‌రువు త‌గ్గిపోయి.. మెరుపుతీగ‌లా మారిన హ‌న్సిక‌ను కూడా ఔరా అనుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. చ‌క్క‌న‌మ్మా చిక్కినా అంద‌మే అన్న‌ట్లు హ‌న్సిక ఎలా ఉన్నా కూడా అందాల ముద్దుగుమ్మే. మ‌రి అందాలు ఆర‌బోయ‌కుండా హ‌న్సిక మ‌ళ్లీ కెరీర్ ముందుకు తీసుకెళ్తుందా..? ఏమో చూడాలిక‌..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here