నా ఫోన్ హ్యాక్ అయింది.. వైర‌ల్ అవుతున్న హ‌న్సిక ట్వీట్..

మన ఫోనే కదా ఎక్కడికి పోతుంది అన్ని భద్రంగా ఉంటాయి అంటూ ఏవిపడితే అవి ఫోన్లో సేవ్ చేసుకుంటే తర్వాత చుక్కలు కనిపిస్తాయి. కావాలంటే ఈ విషయం హన్సికను అడగండి బాగా చెబుతుంది. ఈ ముద్దుగుమ్మకు తెలియకుండానే ఫోన్ లో ఫోటోలు మాయమైపోయాయి. నేరుగా అవి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిపోయాయి. బికినీలో ఉన్న హన్సిక ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. రెండు రోజులుగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. గూగుల్ తల్లిని సైతం వేడెక్కిస్తున్నాయి హన్సిక ఫోటోలు ఇప్పుడు.

They Leaked Hansika Private Pics
They Leaked Hansika Private Pics

అయితే ఈ ఫోటోలు ఎలా బయటికి వచ్చాయ‌నేది తనకు తెలియదని.. తన ఫోన్ ఎవరో హ్యాక్ చేశారని చెబుతోంది హన్సిక. దయచేసి ఎవరు మెసేజ్ లకు రిప్లై ఇవ్వొద్ద‌ని ట్వీట్ చేసింది ఈ భామ‌. ఈ ఫోటోలు ఎలా బయటికి వచ్చాయి ఎవరు లీక్ చేశారు అనే విషయంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు ఎన్ని చేసినా కూడా లాభం లేదు. ముందు కాస్త జాగ్రత్త పడి ఉంటే ఇలాంటి తిప్పలు వచ్చేవి కాదు కదా అంటున్నారు ఆమె అభిమానులు. సరిగ్గా కొన్ని రోజుల కింద శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ కు కూడా ఇలాంటి తిప్పలే వచ్చాయి. ఆమె ఫోన్లో నుంచి పర్సనల్ బెడ్ రూమ్ ఫోటోలు బయటకు లీకయ్యాయి. ఇది ఎవరు లీక్ చేశారు అనేది ఇప్పటి వరకు తేలలేదు. మరి ఇప్పుడు హన్సిక ఫోటోలు విషయంలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *