గుంటూర్ టాకీస్ తమిళ్ సాంగ్ చూసారా..?

ర‌ష్మి గౌత‌మ్ అనే ఓ హీరోయిన్ ఉంద‌ని ప్రేక్ష‌కుల‌కు తెలియ‌చేసిన సినిమా గుంటూర్ టాకీస్. అప్ప‌టి వ‌ర‌కు జ‌బ‌ర్ద‌స్ధ్ లో జ‌బ‌ర్ద‌స్థ్ గా అందాల‌న్నీ ఆర‌బోస్తున్నా కూడా వెండితెరపై ర‌ష్మికి అవ‌కాశాలు వ‌చ్చేలా చేసింది మాత్రం గుంటూర్ టాకీస్ సినిమానే. ప్ర‌వీణ్ స‌త్తార్ తెర‌కెక్కించిన ఈ చిత్రం మంచి విజ‌య‌మే సాధించింది.

అడ‌ల్ట్ కామెడీస్ కు తెర‌తీసింది. ఇప్పుడు ఇదే సినిమాను త‌మిళ‌నాట రీమేక్ చేస్తున్నారు. అక్క‌డ ఏఆర్ ముఖేష్ ఈ చిత్రాన్ని ఇవ‌నుక్కు ఎంగాయో మ‌చ్చం పేరుతో రీమేక్ చేస్తున్నాడు. విమ‌ల్, హ‌స్నాజవేరీ జంట‌గా న‌టిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రంలోని ఓ పాట విడుద‌లైంది. అందులో గుంటూర్ టాకీస్ హాట్ సాంగ్ ఉంటుంది క‌దా.. ఇప్పుడు ఆ పాట‌ను విడుద‌ల చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇక్క‌డ ర‌ష్మి గౌత‌మ్ అందాల‌న్నీ ఆర‌బోస్తే అక్క‌డ హ‌స్నా ఆ భాద్య‌త తీసుకుంది.

ఇప్పుడు వ‌చ్చిన ఈ పాట‌లో ప‌చ్చిగా రెచ్చిపోయింది హ‌స్నా. ఇక్క‌డ ర‌ష్మి ముద్దులు కూడా పెడితే అక్క‌డ అవి మాత్రం క‌ట్ చేసారు. విమ‌ల్, హ‌స్నా కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ ఒక్క పాట‌తోనే ఇక్క‌డ గుంటూర్ టాకీస్ బిజినెస్ అయిపోయిన‌ట్లు.. అక్క‌డ కూడా సేమ్ ఇదే జ‌రిగేలా క‌నిపిస్తుంది. తెలుగుతో పోలిస్తే త‌మిళ‌నాట ఇంకా అడ‌ల్ట్ కామెడీస్ ఈ మ‌ధ్య ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. మ‌రి ఈ గుంటూర్ టాకీస్ ఏం చేస్తుందో చూడాలిక‌. డిసెంబ‌ర్ లోనే విడుదల కానుంది ఈ చిత్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *