సాయిధ‌రంతేజ్ ఏం చేస్తున్నాడు అస‌లు..?

ఇండ‌స్ట్రీలో జాత‌కం మార‌డానికి ఏళ్ల‌తో ప‌నిలేదు.. వేళ్ల‌మీద లెక్క పెట్టేంత స‌మ‌యం చాలు. సాయిధ‌రంతేజ్ విష‌యంలోనూ ఇదే జ‌రిగింది. ఈయ‌న ఇండ‌స్ట్రీకి తారాజువ్వ‌లా వ‌చ్చాడు. కానీ ఇప్పుడు పేల‌ని ఒత్తులా మిగిలాడు. ఒక‌టి రెండు కాదు.. వ‌ర‌స‌గా ఆరు ఫ్లాపుల‌తో సాయిధ‌రంతేజ్ ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిపోయాడు. వైకుంఠ‌పాళిలో ఆడటం తెలియ‌క నిచ్చెన నుంచి జారి ప‌డుతున్నాడు ఈ కుర్ర హీరో. విన్న‌ర్ నుంచి మ‌నోడి టైమ్ ట‌ర్న్ అయింది. దాని దెబ్బ నుంచి కోలుకోక ముందే న‌క్ష‌త్రం రూపంలో అన‌కొండ వ‌చ్చి మింగేసింది. అయ్యోరామా అనుకుంటున్న టైమ్ లో మందు రాస్తుందేమో అనుకున్న జ‌వాన్ అనే మ‌రో పాము వెన‌క నుంచి వ‌చ్చి కాటేసింది.

sai-dharam-tej
ఇన్ని కాట్లు ప‌డిన త‌ర్వాత కూడా ఇంకా నిచ్చెన వ‌స్తుంద‌నే ఆశ‌తోనే ఉన్నాడు సాయిధ‌రంతేజ్. అలాంటి టైమ్ లో వ‌చ్చిన ఇంటిలిజెంట్ అన్నింటికంటే పెద్ద కాటేసింది. దెబ్బ‌కు టాప్ కి వెళ్లిపోదాం అనుకున్న సాయికి ఈ చిత్రం కింది నుంచి టాప్ కు తీసుకెళ్లింది. త‌న కెరీర్ ను పూర్తిగా మింగేయ‌డానికి వ‌చ్చిన అతిపెద్ద పురాత‌న అన‌కొండ ఇదే అని గ్ర‌హించలేకేపోయాడు మెగా మేన‌ల్లుడు. ఈ కాటు దెబ్బ‌కు సాయి ఇప్ప‌ట్లో లేచేలా కూడా క‌నిపించ‌ట్లేదు. అంత దారుణమైన కాటు ప‌డింది. తేజ్ ఐ ల‌వ్ యూ కూడా క‌నీసం 5 కోట్ల మార్క్ కూడా అందుకోవ‌డం లేదంటే సాయి ప‌రిస్థితి ఎలా ఉందో అర్థ‌మ‌వుతుంది.
దాంతో ఇప్ప‌ట్నుంచి ద‌ర్శ‌కుల బ్రాండ్ కాద‌ని.. క‌థ‌ను న‌మ్ముకోవాల‌ని చూస్తున్నాడు తేజ్. ఇప్ప‌టికే కిషోర్ తిరుమ‌ల‌తో చిత్ర‌ల‌హ‌రి.. గోపీచంద్ మ‌లినేనితో ఓ మెడిక‌ల్ మాఫియా సినిమా చేయ‌బోతున్నాడు సాయి. చిత్ర‌ల‌హ‌రిపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు ఈ హీరో. ఇందులో హీరోయిన్ల పేర్లు చిత్ర.. ల‌హ‌రి. ఒక‌రు నివేదా థామ‌స్.. మ‌రొక‌రు ఇంకా తేల‌లేదు. అయితే ఈ రెండు సినిమాల‌ను ఇప్పుడు కాకుండా కాస్త గ్యాప్ తీసుకుని మొద‌లు పెట్ట‌నున్నాడు. మ‌రి ఈ అంత‌ర్మ‌థ‌నం అయినా సాయిని బ‌య‌ట ప‌డేస్తుందో లేదో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here