గోపీచంద్ ఏం చేయాల‌నుకుంటున్నాడు పాపం..?

రెండు మూడేళ్ల గోపీచంద్ కు ఉన్న ఇమేజ్ వేరు.. ఆయ‌న మార్కెట్ వేరు. గోపీ సినిమా వ‌స్తుందంటే మినిమ‌మ్ గ్యారెంటీ ఉండేది. 10 నుంచి 15 కోట్ల మ‌ద్య‌లో త‌న బిజినెస్ చేసుకుని వెళ్లిపోయేవాడు. న‌మ్మిన బ‌య్య‌ర్ల‌ను కూడా ముంచేవాడు కాదు. కానీ ఇప్పుడు అలా లేదు ప‌రిస్థితి. ఈయ‌న ప‌రిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. సినిమాలు బాగున్నా కూడా క‌లెక్ష‌న్లు రావ‌డం లేదు ఇప్పుడు. పంతం సినిమా చూసిన త‌ర్వాత అంద‌రికీ అనిపించింది ఇదే. 25వ సినిమా క‌దా అందుకే కాస్త శ్ర‌ద్ధ పెట్టి మ‌రీ సోష‌ల్ మెసేజ్ ఉన్న క‌థ చేసాడు ఈ హీరో.

Gopichand Next Movie confusion

కొత్త ద‌ర్శ‌కుడే అయినా కూడా చ‌క్ర‌వ‌ర్తి దీన్ని బాగానే హ్యాండిల్ చేసాడు. అయితే క‌థ మ‌రీ రొటీన్ కావ‌డ‌మే ఇక్క‌డ అస‌లు చిక్కుల్ని తీసుకొచ్చింది. గోపీచంద్ త‌న పాత్ర వ‌ర‌కు చంపేసాడు.. ఈ పాత్ర కోస‌మే పుట్టాడా అనేంత‌గా ఇందులో ఒదిగిపోయాడు. కానీ క‌థ స‌హ‌క‌రించ‌క‌పోతే పాపం ఆయ‌న మాత్రం ఏం చేస్తాడు..?

పంతం ఫ్లాప్ కావ‌డంతో ఇప్పుడు గోపీచంద్ కు ఎలాంటి సినిమాలు చేయాలో కూడా అర్థం కావ‌డం లేదు. ప్ర‌స్తుతానికి ఇద్ద‌రు ముగ్గురు ద‌ర్శ‌కులు క‌థ‌లు చెప్పినా కూడా ఏదీ క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. అయితే ఇప్పుడు ఈయ‌న ఓ కొత్త ద‌ర్శ‌కుడితో సినిమా చేయ‌డానికి ముందుకొస్తున్నాడు. తెలుగు కారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నాగినీడు అన్న కొడుకును ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఓ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చేయ‌బోతున్నాడు గోపీ. దీనిపై ఇంకా అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ రాక‌పోయినా కూడా ఇప్పుడు గోపీచంద్ త‌ను ఉన్న ప‌రిస్థితుల్లో క‌చ్చితంగా కొత్త క‌థ చేయాల‌ని ఫిక్సైపోయాడు.

పాత క‌థ‌లు చేసి చేతులు కాల్చుకునే క‌న్నా కూడా కొత్త క‌థ‌ల వైపు ప‌రుగులు తీయ‌డం మంచిదంటున్నాడు. అందుకే సంపత్ నంది లాంటి ద‌ర్శ‌కులు వెంట ప‌డుతున్నా కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు. అదే టైమ్ లో గోపీ ల‌క్కీ డైరెక్ట‌ర్ శ్రీ‌వాస్ కూడా ఈయ‌న కోసం క‌థ సిద్ధం చేస్తున్నాడు. ల‌క్ష్యం.. లౌక్యం ఈ కాంబినేష‌న్ లోనే వ‌చ్చాయి. మ‌రి చూడాలిక‌.. ఎవ‌రు గోపీచంద్ కెరీర్ ను మ‌ళ్లీ గాడిన పెడ‌తారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here