వీళ్లు మార‌రు.. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మ‌రో హీరోయిన్..

ఇండ‌స్ట్రీలో తాగ‌డం అనేది చాలా కామ‌న్. దానికి వాళ్లు స్టైల్ గా సోష‌ల్ డ్రింకింగ్ అనే పేరు కూడా పెట్టుకున్నారు. పార్టీల‌కు వెళ్ల‌డం.. అక్క‌డ ఫుల్లుగా తాగ‌డం కామ‌న్ అయిపోయింది. అయితే తాగిన‌వాళ్లు కామ్ గా అక్క‌డే అయినా ఉండాలి లేదంటే ఎవ‌రైనా తోడుగా అయినా ఉండాలి.

Gayathri-raghuram-booked-for-drunk-driving

అలా కాకుండా తాగి రోడ్డు మీద‌కు కార్లు తీస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని ఓ వైపు పోలీసులు నెత్తి నోరు మొత్తుకుని చెబుతున్నా కూడా ఎవ‌రూ విన‌డం లేదు. ఇదివ‌ర‌కు చాలా మంది అడ్డంగా దొరికిపోయినా కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇప్పుడు కూడా ఈ కేస్ లో ఓ హీరోయిన్ దొరికిపోయింది.

ప్రముఖ నటి, డాన్స‌ర్, బిగ్ బాస్ ఫేమ్ గాయత్రీ రఘురామ్ డ్రంకెన్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డింది. చెన్నైలోని ఎంఆర్సీ నగర్ లో ఉన్న ఓ స్టార్ హోటల్ లో పార్టీ చేసుకుని తిరిగి వ‌స్తున్న ఆమె వాహ‌నాన్ని పోలీసులు ఆపారు.. బ్రీత్ అనలైజర్ లో చెక్ చేయ‌గా అమ్మాయిగారు మోతాదుకు మించి మ‌ద్యం తీసుకున్నార‌ని అర్థ‌మైపోయింది.

ఇదే విష‌యాన్ని ఆమె కూడా ఒప్పుకుంది. దాంతో వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను జాగ్ర‌త్త‌గా ఇంటి ద‌గ్గ‌ర దిగ‌బెట్టి వ‌చ్చారు. అక్క‌డ మీడియా హ‌డావిడి పెరగ‌డంతో ఇష్యూ సీరియ‌స్ కాకుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించారు పోలీసులు. మొబైల్ కోర్టులో రూ. 3,500 జరిమానా చెల్లించి డాక్యుమెంట్లు తీసుకోవచ్చని అన్నారు. మొత్తానికి ఇలా స్టార్స్ వ‌చ్చి రోడ్డు మీద మందు కొడుతుంటే ఇక సామాన్య ప్రేక్ష‌కులు ఏమైపోవాలో ఏంటో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here