ఎఫ్ 2 క‌థ అక్క‌డ్నుంచి అనిల్ రావిపూడి స్పూర్థి పొందాడా..?

ఈ రోజ‌ల్లో ఏ సినిమా క‌థ‌నైనా కూడా కాస్త ప‌ట్టి చూస్తే ఎక్క‌డో ఓ చోట దాని ఒరిజిన‌ల్ దొరికేస్తుంది. ప్ర‌తీ సినిమాకు ఇది కామ‌నే. ఎక్క‌డో ఓ చోట కామ‌న్ పాయింట్స్ త‌గులుతూ ఉంటాయి. అలాగ‌ని వాటిని కాపీ కొట్టారు అన‌డం త‌ప్పే. ఒక్కోసారి ఇద్ద‌రికి ఒకే ఐడియా వ‌స్తుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి కూడా ఇదే చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఈయ‌న తెర‌కెక్కిస్తున్న ఎఫ్ 2 క‌థతో ఒక‌ప్పుడు తెలుగులో వ‌చ్చిన పాత సినిమాకు పోలిక‌లు ఉన్నాయంటూ వార్త‌లు వ‌స్తున్నాయి.

f2-story-copy

1991లో ఇంట్లో పిల్లి వీధిలో పులి అనే సినిమా వచ్చింది. మిడిల్ ఏజ్ పాత్ర‌లో చంద్రమోహన్.. యువకుడిగా సురేష్ నటించిన ఆ సినిమా ప‌ర్లేద‌నిపించింది. బయట పులిలా రెచ్చిపోతూ.. ఇంట్లో పెళ్ళాం ముందు మాత్రం చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డే భ‌ర్త‌ల పాట్లు ఈ చిత్ర క‌థ‌థ‌. అందుకే టైటిల్ కూడా ఇంట్లో పిల్లి వీధిలో పులి అని పెట్టాడు ద‌ర్శ‌కుడు పిఎన్ రామచంద్రరావు.
ఇప్పుడు ఎఫ్ 2 క‌థ కూడా ఇలాగే ఉంది. టీజ‌ర్ లోనే ఈ లైన్ క‌నిపించింది. చంద్ర‌మోహ‌న్ పాత్ర‌లో వెంకటేష్.. సురేష్ పాత్ర‌లో వరుణ్ తేజ్ న‌టిస్తున్నార‌ని అర్థ‌మైపోతుంది.

ఇక వాళ్ల పెళ్లాలుగా తమన్నా, మెహ్రీన్ క‌నిపిస్తున్నారు. అయితే కేవ‌లం లైన్ మాత్ర‌మే తీసుకుని దానికి పూర్తిగా త‌న మార్క్ అద్దేసాడు అనిల్. అది కూడా పూర్తిగా ఇంకా క్లారిటీ రాలేదు. ఒక‌వేళ అనిల్ రావిపూడికి కూడా ఇదే ఐడియా వ‌చ్చిందేమో చెప్ప‌లేం క‌దా. అందుకే స్పూర్థి అంతే. అయినా న‌చ్చేలా కాపీ కొడితే అంత‌కంటే కావాల్సిందేమీ లేదు. ఇప్పుడు అనిల్ కూడా ఇదే చేస్తున్నాడేమో మ‌రి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఎఫ్2 ఆడియో రిలీజ్ డిసెంబ‌ర్ చివ‌ర్లో కానుంది. సినిమా సంక్రాంతికి విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here