ఎఫ్ 2 ప‌రిస్థితేంటి.. అల్లుడు ఎందుకు అలా ఉన్నారు..?

సంక్రాంతి అల్లుళ్లు అంటూ ఎఫ్ 2 సినిమాను బాగానే ప్ర‌మోట్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఈయ‌న తెర‌కెక్కిస్తున్న సినిమా ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్. ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోయింది. ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న తీరు చూసి అస‌లు ఫ‌న్ అండ్ ప్ర‌స్టేష‌నా లేదంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్సా అనే అనుమానం కూడా వ‌స్తుంది.

F2 Telugu Movie Release Date Locked

ప‌క్కా ప్లానింగ్ తో అంద‌రికీ పిచ్చెక్కిస్తూ షూటింగ్ పూర్తి చేసాడు అనిల్ రావిపూడి. వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ ఇందులో హీరోలుగా న‌టిస్తున్నారు. ప్ర‌తీ షెడ్యూల్లోనూ అంద‌రూ క‌లిసే ఉంటున్నారు. స్క్రిప్ట్ లో అంద‌రికీ స‌మాన హ‌క్కు ఇచ్చిన‌ట్లున్నాడు అనిల్. అంతా క‌లిసి ఫోటోల‌కు పోజులు కూడా ఇస్తున్నారు.

ఇక మొన్న విడుద‌లైన లుక్.. ఆ మ‌ధ్య వ‌చ్చిన లుక్ చూస్తుంటే ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్స్ పై సెటైర్లు పేలుతున్నాయి. అస‌లు ఇక్క‌డ సినిమా చేస్తున్నారా లేదంటే బ‌ట్ట‌ల షాప్ యాడ్ చేస్తున్నారా అంటున్నారు ప్రేక్ష‌కులు. దాంతో ఇప్పుడు కాస్త శ్ర‌ద్ధ తీసుకుని మంచి పోస్ట‌ర్లు విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ మొహంలో విచిత్ర‌మైన ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తున్న‌ట్లు ఉండే పోస్ట‌ర్లు ఇప్పుడు విడుద‌లయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సంక్రాంతి అల్లుళ్లు అంటూ ప్ర‌మోష‌న్ కూడా చేస్తూ జ‌న‌వ‌రి 12న ఈ చిత్రం విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. ఎఫ్ 2తో వ‌ర‌స‌గా నాలుగో విజ‌యాన్ని అనిల్ రావిపూడి త‌న ఖాతాలో వేసుకుంటాడో లేదో..?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here