ఎఫ్ 2 పోస్ట‌ర్స్ పై సెటైర్లు.. యాడ్స్ అంటూ క‌మెంట్స్..

అనిల్ రావిపూడి ఇప్పుడు చేస్తున్న సినిమా ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది. ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న తీరు చూసి అస‌లు ఫ‌న్ అండ్ ప్ర‌స్టేష‌నా లేదంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్సా అనే అనుమానం కూడా వ‌స్తుంది. ప‌క్కా ప్లానింగ్ తో అంద‌రికీ పిచ్చెక్కిస్తూ షూటింగ్ పూర్తి చేసాడు అనిల్ రావిపూడి. వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ ఇందులో హీరోలుగా న‌టిస్తున్నారు.

f2morefun

ప్ర‌తీ షెడ్యూల్లోనూ అంద‌రూ క‌లిసే ఉంటున్నారు. స్క్రిప్ట్ లో అంద‌రికీ స‌మాన హ‌క్కు ఇచ్చిన‌ట్లున్నాడు అనిల్. అంతా క‌లిసి ఫోటోల‌కు పోజులు కూడా ఇస్తున్నారు. ఇక మొన్న విడుద‌లైన లుక్.. ఇప్పుడు వ‌చ్చిన లుక్ చూస్తుంటే ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్స్ పై సెటైర్లు పేలుతున్నాయి.

అస‌లు ఇక్క‌డ సినిమా చేస్తున్నారా లేదంటే బ‌ట్ట‌ల షాప్ యాడ్ చేస్తున్నారా అంటున్నారు ప్రేక్ష‌కులు. వ‌రుణ్ తేజ్, వెంక‌టేష్ అలాగే ఉన్నారు కూడా. వెంక‌టేశ్ కు జోడీగా త‌మ‌న్నా.. వ‌రుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ న‌టిస్తున్నారు. ఇప్పుడు విడుద‌లైన లుక్స్ అయితే సినిమాపై చాలా కామెడీ సెటైర్లు వ‌చ్చేలా చేస్తున్నాయి. మ‌రి ఇది అనిల్ రావిపూడి వ‌ర‌కు వెళ్లిందా.. వెళ్లినా కావాల‌నే ఇలాంటి పోస్ట‌ర్లు విడుద‌ల చేస్తున్నాడా అనేది ఆస‌క్తిక‌ర‌మే. సంక్రాంతి అల్లుళ్లు అంటూ ప్ర‌మోష‌న్ కూడా చేస్తున్నాడు అనిల్. ఈ చిత్రం 2019 జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ ఎఫ్ 2తో వెంకీ, వ‌రుణ్ ఏం చేస్తారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here