ఎఫ్ 2.. అనిల్ ఏదేదో చేస్తున్నాడు సామి..?

అనిల్ రావిపూడి ఇప్పుడు చేస్తున్న సినిమా ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌నా.. లేదంటే ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్సా.. ఏమో ఇప్పుడు తీరు చూస్తుంటే కాస్త అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈ చిత్ర షూటింగ్ అప్పుడే స‌గానికి పైగా పూర్తైపోయింది. ప‌క్కా ప్లానింగ్ తో అంద‌రికీ పిచ్చెక్కిస్తున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ ఇందులో హీరోలుగా న‌టిస్తున్నారు. ప్ర‌తీ షెడ్యూల్లోనూ అంద‌రూ క‌లిసే ఉంటున్నారు. స్క్రిప్ట్ లో అంద‌రికీ స‌మాన హ‌క్కు ఇచ్చిన‌ట్లున్నాడు అనిల్. వ‌రుణ్ తేజ్ తొలిరోజు నుంచే ఉంటే.. వెంకీ నాలుగు రోజుల త‌ర్వాత షూట్ లో అడుగు పెట్టాడు. వ‌రుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్.. వెంకీకి జోడీగా త‌మ‌న్నా న‌టిస్తున్నారు.

f2 anil
మొన్న‌టి వ‌ర‌కు ఈ చిత్రం షూటింగ్ పెరుగ్వేలో జ‌రిగింది. అక్క‌డే 10 రోజులు షూటింగ్ చేసుకుని వ‌చ్చాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇప్పుడు బ్యాంకాక్ లో మిగిలిన పార్ట్ షూట్ పూర్తి చేస్తున్నాడు అనిల్ రావిపూడి. సీనియ‌ర్ హీరోయిన్ ఎవ‌రైనా మ‌రీ రొటీన్ అయిపోతుంద‌ని భావించిన అనిల్ రావిపూడి.. కొత్త‌గా ఉంటుంద‌ని త‌మ‌న్నాను సెట్ చేసాడు. పైగా ఇప్పుడు త‌మ‌న్నాకు కూడా పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. ఇలాంటి టైమ్ లో వెంక‌టేశ్ తో అవ‌కాశం అంటే చిన్న‌దేం కాదు. పైగా ఇప్పుడు త‌మ‌న్నా కూడా సీనియ‌ర్ హీరోయినే క‌దా..? ఈ చిత్రం 2019 జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. బ్యాంకాక్ షెడ్యూల్ అయిపోయిందంటే షూటింగ్ కూడా పూర్తైపోయిన‌ట్లే. మ‌రి చూడాలిక‌.. ఎఫ్ 2తో ఏం మాయ చేయ‌బోతున్నాడో అనిల్ రావిపూడి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here