బికినీ ఒక్క‌టేనా.. మ‌రో డ్ర‌స్ కుట్టించుకో దిశాప‌టానీ..? 

ఏమో ఇప్పుడు ఈ భామ‌ను చూస్తుంటే ఇదే అనాల‌నిపిస్తుంది మ‌రి. ఎప్పుడూ చూడు బికినీలోనే క‌నిపిస్తుంటుంది దిశాప‌టానీ. అస‌లు ఇంట్లో మ‌రో డ్ర‌స్ లేన‌ట్లుగా బికినీ ఒక్క‌టే వేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మ‌రోసారి ఇదే చేస్తుంది.

ఈమె తెలుగులో చేసింది ఒకే సినిమా.. అది కూడా డిజాస్ట‌ర్. అందుకే పెద్ద‌గా గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. కానీ ఎప్పుడూ త‌న అందాల‌తో నేనంటూ ఒక‌దాన్ని ఉన్నానంటూ గుర్తు చేస్తూనే ఉంటుంది ఈ లోఫ‌ర్ బ్యూటీ. బాలీవుడ్ నుంచి ఈ వ‌య్యారాన్ని తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌ట్టుకొచ్చాడు పూరీ జ‌గ‌న్నాథ్. లోఫ‌ర్ ఫ్లాప్ అవ్వ‌డంతో దిశ కెరీర్ ద‌శ‌దిశ లేకుండా పోయింది తెలుగులో.

 

అక్క‌డ ఎమ్మెస్ ధోనీ బ‌యోపిక్ లో చిన్న పాత్ర‌లో న‌టించింది. ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది గానీ దిశాకు ఒరిగిందేమీ లేదు. జాకీచాన్ తో న‌టించిన కుంగ్ ఫూ యోగా సైతం ఫ్లాప్ అయింది. ఈ సినిమాతో త‌న జాత‌కం మారుతుంద‌ని ఆశించిన దిశా కెరీర్ జాకీచాన్ దెబ్బ‌కు ద‌శాదిశా లేకుండా పోయింది. ఇదిలా ఉండ‌గానే.. ఫోటోషూట్ల‌తో మ‌త్తెక్కిస్తుంది దిశాప‌టాని. ఆ మ‌ధ్య‌ డ‌బూర‌త్నాని కాలెండ‌ర్ కోసం ఏకంగా న్యూడ్ ఫోటోషూట్ చేసింది దిశా.

దీనికోసం టాప్ లెస్ గా ఈ భామ ఇచ్చిన పోజు బాలీవుడ్ తో పాటు హోల్ ఇండియాను ఊపేసింది. ఇక బ‌య‌టి ఫంక్ష‌న్ ల‌లో కూడా దిశాప‌టానీ అందాల ఆర‌బోత‌కు అడ్డు క‌ట్ట వేయ‌లేక‌పోతున్నారు. తాజాగా మ‌రోసారి బీచ్ లో బికినీ వేసుకుని కూర్చుని సూర్యుడికే మంట పుట్టించింది దిశాప‌టానీ. అస‌లు ఈ బికినీ ట్రీట్ తో బాలీవుడ్ కూడా రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించేసింది. అంత‌గా అందాల‌కు ప‌దును పెడుతుంది ఈ భామ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here