ప‌రుశురామ్ ప‌రిస్థితేంటి ఇలా మారిపోయింది..?

ఎవ‌రా బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తే ద‌ర్శ‌కున్ని తీసుకెళ్ళి నెత్తిన పెట్టుకుంటారు.. అది కూడా తెలుగు ఇండ‌స్ట్రీలోనే అతిపెద్ద విజ‌యాల్లో ఒక‌టి ఇచ్చిన‌పుడు ఆ ద‌ర్శ‌కుడి రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి..? అదేంటో కానీ ఇప్పుడు ప‌రుశురామ్ ప‌రిస్థితి మాత్రం అలా లేదు. గీత‌గోవిందం త‌ర్వాత ఈ ద‌ర్శ‌కుడి నుంచి ఒక్క సినిమా కూడా అనౌన్స్ కాలేదు.

Director parasuram about his upcoming movie

కొన్ని రోజులుగా విష్ణుతో సినిమా చేస్తాడ‌నే వార్త‌లు వ‌చ్చినా కూడా అందులో ఏ క్లారిటీ రాలేదు. ఈయ‌న కోస‌మే విష్ణు కూడా మ‌రే సినిమా సైన్ చేయ‌కుండా వేచి చూస్తున్నాడన్నారు. కానీ దానిపై కూడా క్లారిటీ లేదు. దాంతో ఇప్పుడు ప‌రుశురామ్ ఖాళీగానే ఉన్నాడు.

విష్ణు సినిమా కోసం అప్ప‌ట్లో శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ సంస్థ‌లో ప‌రుశురామ్ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడ‌ని చెప్పారు కానీ ఆ త‌ర్వాత అలాంటిదేం లేద‌ని చెప్పాడు ఈ ద‌ర్శ‌కుడు. ఈయ‌న త‌ర్వాతి సినిమా కూడా గీతాఆర్ట్స్ కు లాక్ అయింది. అంటే నెక్ట్స్ ఏ సినిమా చేసినా అది అల్లు అర‌వింద్ నిర్మాణంలోనే ఉంటుంది. స్టార్ హీరోలు కూడా కుళ్లుకునేలా గీత‌గోవిందం కుమ్మేసింది. అయినా కూడా స్టార్స్ ఎవ‌రూ ఈ ద‌ర్శ‌కున్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం విడ్డూరం.

మంచు విష్ణుతో ప‌రుశురామ్ సినిమా ఇప్పుడు ఊహించ‌డం క‌ష్ట‌మే. మ‌రోవైపు బ‌న్నీతో సినిమా ప్లాన్ చేసుకున్నా కూడా అది కుద‌ర్లేదు. దాంతో మ‌రోసారి ఖాళీ అయిపోయాడు ఈ ద‌ర్శ‌కుడు. తీసే ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్స్ కు కూడా రెండు మూడేళ్లు గ్యాప్ తీసుకుంటే ఎలా అని ప్ర‌శ్నిస్తున్నారు ఈ ద‌ర్శ‌కున్ని..? మ‌రి దీనికి ఈయ‌న ఎలాంటి స‌మాధానం చెప్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here