మారుతి.. ఈ గోల మ‌న‌కేలా..?

ఇప్పుడు ఈయ‌న్ని చూసి అభిమానులు కూడా ఇదే అంటున్నారు. ఒక‌ప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడు ఎలా అయిపోతున్నాడు అంటున్నారు మారుతిని చూసి. అయినా ఇన్నాళ్లూ మారుతి అంటే ఇన్నాళ్ళూ హిట్ డైరెక్ట‌ర్. ఈయ‌న చేసిన ఏ సినిమా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య్య‌ర్ల‌ను దారుణంగా ముంచేయ‌లేదు.. అలాగ‌ని ప్ర‌తీ సినిమా భారీ లాభాలు కూడా తీసుకురాలేదు.

పెట్టిన డ‌బ్బుల‌ను వెనక్కి తెచ్చాయి.. ఒక‌ట్రెండు సినిమాలు భారీ లాభాలు కూడా తీసుకొచ్చాయి. ముఖ్యంగా భ‌లేభ‌లే మ‌గాడివోయ్ లాంటి సినిమాలు అయితే క‌లెక్ష‌న్ల పంట పండించాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయ‌న తెర‌కెక్కించిన శైల‌జారెడ్డి అల్లుడు ప‌రిస్థితి మ‌రోలా మారిపోయింది. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. బ‌య్య‌ర్ల‌ను దాదాపు 7 కోట్ల వ‌ర‌కు ముంచేసింది. దాంతో మారుతికి చాలా రోజుల త‌ర్వాత ఫెయిల్యూర్ వ‌చ్చింది. అది మ‌రిచిపోక‌ముందే ఈయ‌న క‌థ ఐడియా ఇచ్చిన భలే మంచి చౌక బేర‌మ్ సినిమా వ‌చ్చి వెళ్లిన‌ట్లు కూడా ఎవ‌రికీ తెలియ‌దు.

Director Maruthi Interview Photos (1)

ద‌ర్శ‌కుడిగా ఉండ‌కుండా ఇలా అన్నింటిపై మ‌న‌సు పెడితే ఉన్న పేరు కూడా పోతుందంటున్నారు ఆయ‌న అభిమానులు. దీనికి ముందు కూడా మారుతి పేరుతో వ‌చ్చి బ్రాండ్ బాబు.. రోజులు మారాయి లాంటి సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఎందుకు ఈయ‌న అన్నింట్లోనూ ఇలా వెళ్లిపోయి చేతులు పెట్టేస్తున్నాడు అంటూ ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి.

ఇప్పుడు ఈయ‌న ఏం చేస్తాడ‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తి క‌లిగించే అంశం. ఇప్ప‌టికే సాయిధ‌రంతేజ్ కోసం క‌థ సిద్ధం చేస్తున్నాడ‌నే వార్త‌లు అయితే వినిపిస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రాలేదు. మ‌రోవైపు అఖిల్ కోసం కూడా మారుతి క‌థ వండుతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. ఏదేమైనా కొన్ని రోజుల త‌ర్వాత కానీ త‌న త‌ర్వాతి సినిమాపై క్లారిటీ ఇవ్వ‌లేనంటున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. మ‌రి శైల‌జారెడ్డి అల్లుడు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోడానికి మారుతికి ఎన్ని రోజులు ప‌డుతుందో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here