దాస‌రి బ‌యోపిక్ ఉంటుందా.. న‌మ్మొచ్చా..?

దాస‌రి నారాయ‌ణరావు.. తెలుగు ఇండ‌స్ట్రీకి దిక్సూచి ఆయ‌న‌.. ద‌ర్శ‌క కులానికి పెద్ద‌.. ఏ స‌మ‌స్య వ‌చ్చినా ముందుండే నాయ‌కుడు.. ఆయ‌న దూర‌మై అప్పుడే ఏడాదిన్న‌ర దాటిపోయింది. 2017 మే 30న ఈయ‌న అనారోగ్యంతో క‌న్నుమూసారు. అయితే ఈయ‌న చ‌నిపోయిన త‌ర్వాత గుర్తు చేసుకున్న‌ది మాత్రం చాలా త‌క్కువ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు దాస‌రి బ‌యోపిక్ అంటూ మ‌రో వార్త తెర‌పైకి వ‌చ్చింది. ఇంటికి పెద్ద‌లా.. ఇండ‌స్ట్రీకి ఓ పెద్ద‌న్నై ఉండేవాడు ఈయ‌న.

dasari-narayana

ఆయ‌న చ‌నిపోయిన త‌ర్వాతే ఇండ‌స్ట్రీలో అస‌లు లుక‌లుక‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. అస‌లు శ్రీ‌రెడ్డి, క‌త్తిల ఇష్యూలు కూడా దాస‌రి ఉండుంటే అంత దూరం వ‌చ్చుండేవి కావ‌ని చాలా మంది అన్నారు. అది దాస‌రి నారాయ‌ణ‌రావు ప్ర‌త్యేక‌థ‌. ద‌ర్శ‌కుడిగా 151 సినిమాలు.. న‌టుడిగా 70 సినిమాలు.. నిర్మాత‌గా 30 సినిమాల‌కు పైగా నిర్మించిన దాస‌రి.. ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయారు. అయితే ఇప్పుడు ఈయ‌న బ‌యోపిక్ పై మాత్రం ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. అస‌లు చేస్తారా చేయరా అనేది మాత్రం చెప్ప‌డం లేదు. ఆయ‌న శిష్యులు మాత్రం కొంద‌రు క‌చ్చితంగా త‌మ గురువు బ‌యోపిక్ చేస్తామంటున్నారు కానీ అది వ‌స్తుందో రాదో వ‌చ్చేవ‌ర‌కు మాత్రం అనుమాన‌మే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here