సంక్రాంతికి వ‌స్తున్నాం.. కొడుతున్నాం.. దిల్ రాజు న‌మ్మ‌కం.. 

ఏం పర్లేదు సంక్రాంతికి వస్తున్నాం కొడుతున్నాం.. ఓ సినిమా గురించి ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాం అంటే ఎంత న‌మ్మ‌కం ఉండాలి. ఇప్పుడు అది చూపించాడు దిల్ రాజు. ఈయ‌న నిర్మిస్తున్న ఎఫ్ 2 సినిమా గురించి దిల్ రాజు చెప్పిన మాటలివి. ఈయన నమ్మకం చూస్తుంటే పండక్కి నిజంగానే కుమ్మేసేలా కనిపిస్తున్నాడు. ఈయన నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. వరుణ్ తేజ్, వెంకటేష్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకుడు. వరుసగా మూడు విజయాలతో జోరుమీదున్న ఈ దర్శకుడు.. నాలుగో విజయం అందుకోవాలని ఆరాటపడుతున్నాడు.
తొలి మూడు సినిమాల్లో ఎంతగా నవ్వించాడో ఇప్పుడు ఈ ఒక్క సినిమాలో అంతే క‌డుపులు చెక్క‌లు చేయాల‌ని చూస్తున్నాడు. అదే చేస్తాన‌ని ప్రేక్షకులకు ప్రామిస్ చేశాడు అనిల్. ఈయన నమ్మకం చూస్తుంటే కచ్చితంగా వరుసగా నాలుగో విజయం అందుకునేలా కనిపిస్తున్నాడు. తాజాగా జరిగిన ఎఫ్ 2 ఆడియో రిలీజ్ లో కూడా ఒక్కొక్కరు సూపర్ కాన్ఫిడెన్సుతో మాట్లాడేసారు. ఇక దిల్ రాజు అయితే సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా ఎఫ్2 సంచలనం సృష్టిస్తుందని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. దానికి ఆయన ఈ కథపై పెట్టుకున్న నమ్మకమే కారణం.
Dil Raju Sankranthi Sentiment on F2
Dil Raju Sankranthi Sentiment on F2
 పైగా 2017 లో ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలతో పాటు వచ్చిన శతమానంభవతి కూడా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు ఈ నిర్మాత‌. మంచి సినిమాలు వచ్చినప్పుడు ప్రేక్షకులు చూస్తారు.. పండగ సీజన్ లో ఎన్ని సినిమాలు వచ్చినా కూడా స్కోప్ ఉంటుందని చెబుతున్నాడు దిల్ రాజు. అందుకే తమ సినిమాతో పాటు విడుదలవుతున్న బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్.. రామ్ చరణ్ విన‌య విధేయ రామ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు దిల్ రాజు. మరి ఈయన నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here