సాక్ష్యాల‌తో ప‌ట్టుబ‌డిన శ్రీ‌రామ్ ఆదిత్య‌…

అవునా.. ఈ కుర్ర ద‌ర్శ‌కుడు ఏం త‌ప్పు చేసాడు..? అయినా సాక్ష్యాల‌తో ప‌ట్టుబ‌డ‌టం ఏంటి అనుకుంటున్నారా.. ఈయ‌న ఇప్పుడు దేవ‌దాస్ సినిమాతో వ‌స్తున్నాడు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. నాని, నాగార్జున న‌టించిన ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

DEVADAS

అయితే ఈ చిత్ర క‌థ‌పై మాత్రం ముందు నుంచి అనుమానాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ‌రామ్ ఆదిత్య ఎక్క‌డ్నుంచో ఎత్తుకొచ్చాడ‌నే వార్త‌లు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇది త‌న సొంత క‌థ అని ముందు నుంచి చెబుతూనే వ‌స్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఇక ఇప్పుడు ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత అస‌లు విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది.
ఈ చిత్రం ఫ్రీమేక్ అని తెలుస్తుంది. 1999లో హాలీవుడ్ లో వ‌చ్చిన అన‌లైజ్ దిస్ అనే సినిమాకు ఇది ఫ్రీమేక్. ఇందులో కూడా ఓ మాఫియా డాన్.. సైక్రియార్టిస్ట్ మ‌ధ్య సాగే క‌థ.

ఇప్పుడు ఈ చిత్రం కూడా ఇదే నేప‌థ్యంలో సాగుతుంది. ఇందులో డాక్ట‌ర్ గా నాని.. మాఫియా డాన్ గా నాగార్జున న‌టించారు. మ‌న ప్రేక్ష‌కులకు త‌గ్గ‌ట్లు క‌థ‌ను కాస్త మార్చి అదే సినిమాను తెలుగులో శ్రీ‌రామ్ తీసాడంటున్నారు కొంద‌రు. దానికి అన‌లైజ్ దిస్ ట్రైల‌ర్ కూడా సాక్ష్య‌మే. చూడ్డానికి రెండింట్లోనూ సీన్స్ ఒకేలా క‌నిపిస్తున్నాయి. ట్రైల‌ర్ లోనే ప‌రిస్థితి ఇలా ఉంటే సినిమా విడుద‌లైన త‌ర్వాత ర‌చ్చ ఇంకెలా ఉండ‌బోతుందో..? మ‌రి దీనికి శ్రీ‌రామ్ ఆదిత్య అండ్ టీం నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో చూడాలి. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది ఈ చిత్రం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *