అవును.. ఇంత‌కీ దేవ‌దాస్ ప‌రిస్థితేంటి..?

దేవ‌దాస్ విడుద‌లైంది.. టాక్ కూడా బాగానే వ‌చ్చింది.. కానీ బిజినెస్ మాత్రం భారీగా జ‌రిగింది. నాని, నాగార్జున లాంటి స్టార్ హీరోలు ఉండ‌టంతో ఏకంగా 40 కోట్ల బిజినెస్ చేసారు నిర్మాత‌లు. ఇద్ద‌రు స్టార్ హీరోలు ఉన్నార‌నే ధైర్యంతో బ‌య్య‌ర్లు కూడా ధైర్యంగానే సినిమాను కొనేసారు. కానీ సీన్ చూస్తుంటే ఇప్పుడు అది అసాధ్యంగా క‌నిపిస్తుంది. ఇంత మొత్తం రావాలంటే వారం రోజుల్లో క‌చ్చితంగా 30 కోట్లు రావాలి.

Devadas First Weekend Box office Collections

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు 20 కోట్లు కూడా తీసుకురాలేదు దేవ‌దాస్. స్టార్ హీరోలున్నా కూడా టాక్ బాగా రాక‌పోతే నిర్దాక్ష‌ణ్యంగా తిప్పి కొడుతున్నారు జ‌నాలు. దేవ‌దాస్ కు టాక్ బాగా వ‌చ్చినా కూడా ఎందుకో కానీ అనుకున్న క‌లెక్ష‌న్లు అయితే రావ‌డం లేదు.
తీరు చూస్తుంటే నాని, నాగార్జున ఖాతాలో మ‌రో ఫ్లాప్ ప‌డిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. తొలిరోజు 7 కోట్ల‌తోనే స‌రిపెట్టుకున్న దేవ‌దాస్.. ఆ త‌ర్వాత కూడా పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు 6 రోజుల్లో 18 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. అయితే మ‌రో 19 కోట్లు తీసుకురావాలి. ఈ వారం నోటా విడుద‌ల కానుంది. అది వ‌చ్చిన త‌ర్వాత ఇంకే సినిమా క‌నీసం సీన్ లో కూడా క‌నిపించ‌దు. ఎందుకంటే ఇప్పుడు విజ‌య్ దేవ‌రొకండ ఇమేజ్ అలా ఉంది. దానికి టాక్ బాగా వ‌చ్చిందంటే ర‌చ్చ ర‌చ్చే. మ‌రి చూడాలిక‌.. దేవ‌దాస్ మ‌రో ఫ్లాప్ కు ఎలా సిద్ధం అవుతున్నారో..? మ‌రి ఇప్పుడు నాని హిట్ కొట్ట‌డానికి మ‌ళ్లీ ఎన్నేళ్లు ప‌డుతుందో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *