డిసెంబ‌ర్ 21.. 12.6 గంట‌లు థియేట‌ర్స్ లోనే..

ఏంటి లెక్క అర్థం కాలేదు క‌దా.. ఇప్పుడు క్లియ‌ర్ గా మాట్లాడుకుందాం. రోజుకు 24 గంట‌లు ఉంటాయి. అందులో 12 గంట‌లు థియేట‌ర్స్ లో ఉంటే మిగిలిన 12 గంట‌లు ఏం చేయాలి..? ఒకేరోజు రెండు మూడు సినిమాలు రావ‌డం పెద్ద విష‌య‌మేం కాదు. కానీ అన్ని పెద్ద సినిమాలే రావ‌డం మాత్రం నిజంగా విష‌య‌మే.

December 2018 Upcoming Movies

ఇప్పుడు డిసెంబ‌ర్ 21న ఇదే జ‌రుగుతుంది. ఆ రోజే 5 భారీ సినిమాలు వ‌స్తున్నాయి. తెలుగులో రెండు.. త‌మిళ‌నాట 1.. క‌న్న‌డ‌లో 1.. హిందీలో 1 సినిమా విడుద‌ల కానున్నాయి. కేవ‌లం త‌మిళ‌నాడులో అయితే ఒక్క‌రోజే 10 సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఇక ఇవి ప‌క్క‌న‌బెడితే తెలుగులో ప‌డిప‌డి లేచె మ‌న‌సు.. అంత‌రిక్షం విడుద‌ల కానున్నాయి.
ఇందులో ప‌డిప‌డి లేచె మ‌న‌సు రెండు గంట‌ల 40 నిమిషాలు.. అంత‌రిక్షం రెండున్న‌ర గంట‌ల నిడివితో వ‌స్తున్నాయి.

ఇక క‌న్న‌డ కేజీఎఫ్ సినిమా రెండు గంట‌ల 36 నిమిషాల‌తో వ‌స్తుంది. దానికి తోడు ధ‌నుష్ మారి 2 రెండున్న‌ర గంట‌లు.. షారుక్ ఖాన్ జీరో రెండు గంట‌ల 45 నిమిషాల‌తో వ‌స్తున్నాయి. అంటే ఇవ‌న్నీ లెక్కేస్తే 760 నిమిషాలు.. అంటే 12 గంట‌లకు పైగానే వ‌స్తుంది ర‌న్ టైమ్. ఈ లెక్క‌న డిసెంబ‌ర్ 21న సినిమా ప్రియుల‌కు పండ‌గే పండ‌గ‌. రోజంతా ఎవ‌రు ఏ సినిమా కావ‌లిస్తే అది చూసుకోవ‌చ్చు. మొత్తానికి భారీ సినిమాల‌న్నీ ఒకేరోజు వ‌స్తుండ‌టంతో అభిమానులు హ్యాపీగానే ఉన్నారు కానీ బ‌య్య‌ర్లు మాత్రం భ‌యంతో బ‌తికేస్తున్నారు. మ‌రి చూడాలిక‌.. ఇన్ని సినిమాల్లో ఏది హిట్ అవుతుందో.. ఏది షెడ్డుకు వెళ్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here