సైరాలో చిరు చిందులు.. కండీష‌న్స్ అప్లై..

సైరాలో చిరంజీవి డాన్సులు చేయ‌డం ఏంటి..? అస‌లు ఆ సినిమాలో డాన్సులు ఎందుకు ఉంటాయి..? ఆ సినిమా క‌థ లా ఉండ‌దు క‌దా అనుకుంటున్నారా.. నిజ‌మే కానీ చిరంజీవి సినిమా అంటే డాన్సులు కూడా ఉంటాయి. డాన్సులు లేని చిరు సినిమా ఊహించ‌డం క‌ష్టం. అందుకే సైరాలోనూ డాన్సులు ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు మెగాస్టార్. దానికోసం శేఖ‌ర్ మాస్ట‌ర్ తో పాటు మ‌రో ఇద్ద‌రు కొరియోగ్ర‌ఫర్ల‌కు త‌న ఆదేశాలు పంపించాడ‌ని తెలుస్తుంది. త‌న‌కు సూట్ అయ్యే స్టెప్పులు కంపోజ్ చేయాల‌ని కోరుకుంటున్నాడు చిరంజీవి.

sye raa chiranjeeevi
sye raa chiranjeeevi

200 ఏళ్ల నాటి క‌థ కావ‌డంతో ఎబ్బెట్టుగా అనిపించ‌కుండా.. అదే టైమ్ లో చూడ్డానికి ఇబ్బందిగా అనిపించ‌కుండా ఉండేలా ఈ డాన్సులు కంపోజ్ చేస్తున్నాడు శేఖ‌ర్ మాస్ట‌ర్. చిరంజీవి కూడా సైరా కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. 63 ఏళ్ల వ‌య‌సులోనూ డాన్సులు చేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఫ్యాన్స్ కోసం తాను ఎంత రిస్క్ అయినా తీసుకుంటానంటున్నాడు మెగాస్టార్. 200 కోట్ల‌తో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వ‌చ్చే ఏడాది మేలో ఈ చిత్రం విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంలో చిరు చిందులు ఎలా ఉండ‌బోతున్నాయో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here