యూర‌ప్ వెళ్లిన చిరు.. సైరా ఇక షురూ..

అవును.. ఇప్పుడు సైరా నర‌సింహారెడ్డిని యూర‌ప్ రార‌మ్మ‌ని పిలిచింది.. వెళ్లిపోయాడు. సెప్టెంబ‌ర్ తొలివారంలోనే సైరా యూనిట్ అంతా అక్క‌డికి వెళ్లిపోయినా చిరు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఆగాడు. మొత్తం 40 రోజుల షెడ్యూల్ లో ఈయ‌న 20 రోజులు మాత్ర‌మే ఉండ‌టంతో ఇప్పుడు వెళ్లాడు మెగాస్టార్. వెళ్లీ వెళ్ల‌గానే ప‌క్క‌నే అజ‌ర్ బైజాన్ లో జ‌రుగుతున్న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ షూటింగ్ కు వెళ్లి అంద‌ర్నీ క‌లిసాడు చిరు.

CHIRANJEEVI SYERAA SHOOTING

బోయ‌పాటి శీను ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇక అక్క‌డ్నుంచి త‌న సినిమా సెట్ కు వెళ్ల‌నున్నాడు చిరంజీవి. యూర‌ప్ లోని జార్జియా.. ర‌ష్యాలో కూడా యుద్ధ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌ర‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ దాటి సైరా యూనిట్ వెళ్ల‌లేదు. ఇప్పుడు ఆ అవ‌కాశం అవ‌స‌రం రెండూ ఒకేసారి వ‌చ్చాయి. మొన్న‌టి వ‌ర‌కు హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ గ్రెగ్ పావెల్ ఆధ్వ‌ర్యంలో ఫైట్ సీన్స్ కంపోజ్ చేసారు.

ఇక ఇప్పుడు లీ విక్ట‌ర్ ఈ చిత్రం కోసం వ‌చ్చాడు. హాలీవుడ్ లో ఈయ‌న స్టార్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫ‌ర్. ఫారెన్ షెడ్యూల్ లో మొత్తం ఈయ‌నే ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ షెడ్యూల్ లోనే కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి కూడా సైరా యూనిట్ తో జ‌త క‌ల‌వ‌నున్నాడు. ఈయ‌న కూడా యూర‌ప్ వెళ్తున్నాడు. మ‌రోవైపు చిరు కూడా 63 ఏళ్ల వ‌య‌సులోనూ అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఈ షెడ్యూల్లో బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాల‌వాడ పోరాడి మ‌రీ గ‌న్స్ అన్నీ దోచుకునే సీన్స్ గ‌త షెడ్యూల్లోనే ఇక ఇప్పుడు యూర‌ప్ షెడ్యూల్ ను కూడా మ‌రో స్థాయిలో ఉండాలని ప్లాన్ చేసిన సురేంద‌ర్ రెడ్డి.. అందులో మ‌రో హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ ను రంగంలోకి దించాడు. డిసెంబ‌ర్ లోపు షూటింగ్ అంతా ప‌ూర్తిచేసి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి ఈ షెడ్యూల్ త‌ర్వాత చాలా రిలాక్స్ డ్ గా క‌నిపిస్తున్నాడు చిరంజీవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here