పాట‌ల బేబీ రేంజ్ బాగా పెరిగిపోయిందిగా..

ఒక్క పాట‌.. ఒకేఒక్క పాట‌.. ఆమె జీవితాన్ని మార్చేసింది. స‌ర‌దాగా పాడిన ఒక్కపాట ఇప్పుడు ఆమెను తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు అంటే ఇదేనేమో..? ఏదో అనుకోకుండా పాడిన పాట ఇప్పుడు ఆమెను గ్రేట్ సింగ‌ర్స్ జాబితాలో నిల‌బెట్టింది. సోష‌ల్ మీడియా బాగా పెరిగిన ఈ రోజుల్లో ఒక్క‌రోజులో జీవితం ఎలా మారిపోతుందో అప్పుడు ప్రియా వారియ‌ర్ చూపించింది.. ఇప్పుడు పాట‌ల బేబీ నిరూపించింది. ఎక్క‌డో చిన్న ఊరు నుంచి వ‌చ్చి చ‌దువు లేక‌పోయినా కూటికి ఏదో ప‌ని చేసుకుంటున్న ఈమె పాట‌లు ఇప్పుడు తెలుగు వాళ్ల‌ను అల‌రిస్తున్నాయి.

ఓ చెలియా అంటూ ప్రేమికుడు పాట‌ను చ‌క్క‌గా పాడిన బేబీకి ఏఆర్ రెహ‌మాన్ సైతం ఫిదా అయిపోయాడు. ఇప్పుడు అంతా ఈమె పాట‌ల కోసం ప‌రితపిస్తున్నారు. చిరంజీవి కూడా బేబీని ప్ర‌త్యేకంగా ఇంటికి పిలిపించుకుని మ‌రీ పొగిడాడు. ముచ్చ‌ట‌ప‌డి మ‌రీ పాట‌లు పాడించుకున్నాడు. కోటితో పాటు ఇప్పుడు రఘుకుంచె కూడా ఈమెతో పాట పాడించాడు. ఏఆర్ రెహ‌మాన్ కూడా బేబీ పాట‌ల‌కు ఫిదా అయిపోయి చెన్నైకి పిలిపించుకుని అభినందించాడు. మొత్తానికి ఒక్క రోజులో జీవితం మారిపోవ‌డానికి ఇదేమైనా సినిమానా అనే వాళ్ల‌కు ఇప్పుడు బేబీ జీవితం ఓ ఉదాహ‌ర‌ణ‌. ఈమె ఏం చేసినా కూడా ఇప్పుడు సంచ‌ల‌న‌మే. ఇక సినిమా పాట విడుద‌లైన త‌ర్వాత బేబీ గొంతుకు ఇంకెంత‌మంది ఫ్యాన్స్ వ‌స్తారో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here