చిరంజీవి వెళ్లిపోయాడు.. సైరా షూట్ షురూ..

భార‌త‌దేశ తొలి స్వాతంత్య్ర‌ స‌మ‌ర‌యోధుడు దేశం దాటేసాడు. సైరా కోసం యూర‌ప్ వెళ్లిపోయాడు చిరంజీవి. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజుల నుంచి జార్జియాలో జ‌రుగుతున్నా కూడా చిరు మాత్రం ఇక్క‌డే ఉన్నాడు. అయితే ఇప్పుడు చిరు కూడా వెళ్లిపోయాడు. తాజాగా ఈయ‌న జార్జియా షెడ్యూల్ లో జాయిన్ కానున్నాడు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డితో పాటు అంతా ఫారెన్ లోనే ఉన్నారు.

sye-ra

ఇప్ప‌టికే సైరా మేజ‌ర్ షెడ్యూల్ పూర్తైపోయింది. అందుకే హ‌మ్మ‌య్యా అంటూ హాయిగా ఉన్నాడు మెగాస్టార్. ఇప్ప‌టి వ‌ర‌కు గ్రెగ్ పావెల్ ఆధ్వ‌ర్యంలో ఫైట్ సీన్స్ కంపోజ్ చేసారు. ఇక ఇప్పుడు లీ విక్ట‌ర్ ఈ చిత్రం కోసం వ‌స్తున్నాడు. హాలీవుడ్ లో ఈయ‌న స్టార్ యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫ‌ర్.

ఫారెన్ షెడ్యూల్ లో మొత్తం ఈయ‌నే ఫైట్స్ కంపోజ్ చేయ‌బోతున్నాడు. మ‌రోవైపు చిరు కూడా 63 ఏళ్ల వ‌య‌సులోనూ అస్స‌లు త‌గ్గ‌డం లేదు. ఈ షెడ్యూల్లో బ్రిటీష్ వాళ్ల‌పై ఉయ్యాల‌వాడ పోరాడి మ‌రీ గ‌న్స్ అన్నీ దోచుకునే సీన్స్ గ‌త షెడ్యూల్లోనే ఇక ఇప్పుడు యూర‌ప్ షెడ్యూల్ ను కూడా మ‌రో స్థాయిలో ఉండాలని ప్లాన్ చేసిన సురేంద‌ర్ రెడ్డి.. అందులో మ‌రో హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్ ను రంగంలోకి దించాడు. జ‌న‌వ‌రిలోపు షూటింగ్ అంతా ప‌ూర్తిచేసి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ కానుక‌గా సినిమా విడుద‌ల చేయ‌బోతున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మొత్తానికి సైరాతో చిరు కూడా బిజీ అయిపోయాడు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *