ఒలంపిక షూటర్ తో చిరంజీవి సీక్రేట్ క్లాసులు..

చిరంజీవి మ‌న‌సు ఇప్పుడు సైరాపై త‌ప్ప మ‌రో చోట లేదు. ఈ చిత్రాన్ని త‌న కెరీర్ లోనే కాదు.. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ సినిమాగా నిల‌బెట్టాల‌ని చాలా ట్రై చేస్తున్నాడు మెగాస్టార్. త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డంతో 63 ఏళ్ల వ‌య‌సులోనూ ఏజ్ ను ప‌ట్టించుకోకుండా క‌ష్ట‌ప‌డుతున్నాడు చిరంజీవి.

Chiranjeevi learns gun shooting from Olympic medalist

ముఖ్యంగా ఇందులో యాక్ష‌న్ పార్ట్ హైలైట్ కానుంది. దానికోసం హాలీవుడ్ నుంచి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫ‌ర్స్ వ‌చ్చారు. ఇప్పుడు గ‌న్ ఫైరింగ్ విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు చిరంజీవి. ఈయ‌న కోసం ప్ర‌త్యేకంగా ఒలంపిక విజేత గ‌గ‌న్ నారంగ్ వ‌చ్చాడు. చిరు ఇంట్లోనే అత‌డికి స్పెష‌ల్ ట్రైనింగ్ ఇస్తున్నాడు. సైరాలో 200 ఏళ్ల నాటి గ‌న్స్ వాడుతున్నారు.
ఆ తుపాకుల‌ను వాడాలంటే మంచి నేర్ప‌రి కావాలి.

అది తెలిసిన వాడు గ‌గ‌న్ నారంగ్. అత‌డు షూటింగ్ లో ఇండియాకు 2012 లండ‌న్ ఒలంపిక్స్ లో కాంస్య ప‌త‌కం తీసుకొచ్చాడు. గ‌గ‌న్ సాయంతో ఇప్పుడు గ‌న్ ఎలా వాడాలో నేర్చుకుంటున్నాడు మెగాస్టార్. కొన్ని కీల‌క‌మైన స‌ల‌హాలు తీసుకుని వాటిని సినిమాలో యూజ్ చేయ‌బోతున్నాడు చిరంజీవి. యాక్ష‌న్ పార్ట్ తో పాటు డాన్సులు కూడా ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు చిరంజీవి.

మొత్తానికి ఒలంపిక్ షూటర్ తో చిరు క్లాసులు అదిరిపోతున్నాయి.. అందుకే రేపు సినిమాలో గ‌న్ షూటింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంద‌ని ఆశిస్తున్నారు అభిమానులు. జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు మెగాస్టార్. త్వ‌ర‌లోనే హైద‌రాబాద్ లోనే మ‌రో భారీ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. సురేంద‌ర్ రెడ్డి ప్ర‌స్తుతం ఇదే ప‌నిపై బిజీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here