రామ్ చ‌ర‌ణ్ నా ఆస్తి.. కేటీఆర్ నా బెంచ్ మేట్..

వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ వేడుక‌లో చిరంజీవి మాట్లాడిన మాట‌లు ఇవి. ఈ ప్రీ రిలీజ్ వేడుక ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. ఈ వేడుకలో ఒకరిని ఒకరు పొగుడుకున్న తీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చిరంజీవి అయితే కేటిఆర్ ను ఓ రేంజ్లో పొగిడేశాడు. నీ లాంటోడు లేదు అనేంత రేంజ్లో ఆకాశానికి ఎత్తేశాడు మెగాస్టార్.

Chiranjeevi Dialogues at Vinaya vidheya rama Pre release event

తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ అంటూ ఆయనకు కితాబిచ్చేసాడు. ఒకప్పుడు తామిద్దరం బెంచ్ బేట్స్ అని చమత్కరించాడు మెగాస్టార్. అప్పట్లో ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే కేటీఆర్ కూడా ఎమ్మెల్యే గా ఉన్నాడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు చిరంజీవి. ఇక దేవుడు త‌న‌కు ఇచ్చిన ఆస్తులు రెండు అని.. ఒకటి రామ్ చరణ్ అయితే రెండు మీరు అభిమానులను చూపించాడు చిరు.

ఇక‌ సినిమా గురించి మాట్లాడుతూ ఈ కథ బోయ‌పాటి చెప్పినప్పుడు తాను చాలా ఎక్సైట్ అయ్యాను అని.. కచ్చితంగా చరణ్ చేయాల్సిన సినిమా అని అంటూ ఫిక్స్ అయిపోయాను అని చెప్పాడు మెగాస్టార్. రంగస్థలం లాంటి సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న‌పుడు బోయపాటి అయితే సరైన ఆప్షన్ అని తానే చరణ్ కు చెప్పాన‌న్నాడు మెగాస్టార్.

అప్పుడు తాను ఏదైతే చెప్పాడో అదే ఇప్పుడు స్క్రీన్ మీద క‌నిపిస్తుంద‌ని చెప్పాడు ఈ హీరో. ఇందులో చ‌ర‌ణ్ ఫ్యామిలీ రక్షకుడిగా నటిస్తున్నాడని.. అలాంటి పాత్రలు త‌న కెరీర్లో చాలా చేసాన‌ని గుర్తు చేసుకున్నాడు మెగాస్టార్. మొత్తానికి వినయ విధేయ రామ‌ ప్రీ రిలీజ్ వేడుకలో చిరు స్పీచ్ బాగానే హైలెట్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here