మ‌రోసారి తాత అయిన చిరంజీవి.. శ్రీ‌జ‌కు కూతురు..

క్రిస్మస్ రోజు మెగా ఇంట మరో పండగ వచ్చింది. ఆ ఇంట్లోకి మరో కొత్త ప్రాణం పురుడు పోసుకుంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు ఆడ బిడ్డ పుట్టింది. ఇదే విషయాన్ని శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తన ట్విట్టర్లో అనౌన్స్ చేశారు. ఇక చిరంజీవి కూడా తన మనవరాలిని చూసి మురిసిపోతున్నాడు.

Chiranjeevi Daughter Delivers A Baby

పండ‌గ రోజు వ‌చ్చిన ఈ పాప త‌మ జీవితాల్లో మ‌రింత వెలుగు తీసుకొస్తుంద‌ని చెబుతున్నాడు మెగాస్టార్. రెండేళ్ల కింద కళ్యాణ్ దేవ్ తో శ్రీజకు వివాహం జరిగింది. అంతకుముందే ఈమెకు శిరీష్ భరద్వాజ్ తో పెళ్లి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు. రెండేళ్ల తర్వాత భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి మళ్లీ తండ్రి దగ్గరికి వచ్చింది శ్రీజ.

శిరీష్ ను వదిలేసి వచ్చిన తర్వాత అయిదేళ్ల పాటు తండ్రి ద‌గ్గ‌రే ఉంది శ్రీ‌జ‌. రెండేళ్ల కింద కళ్యాణ్ దేవ్ తో ఈమెకు వివాహం జరిగింది. ఇప్పుడు వీళ్ళ దాంపత్యానికి చిహ్నంగా ఓ ఆడపిల్ల పుట్టింది. పండగ రోజు వచ్చిన ఈ పాపాయిని చూసి మెగా కుటుంబం అంతా గాల్లో తేలిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here