చిరంజీవి @ 41 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ..

అవును.. చిరంజీవి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి అప్పుడే 41 ఏళ్లు గ‌డిచిపోయాయి. నాలుగు ద‌శాబ్ధాలుగా త‌న స‌త్తా చూపిస్తూనే ఉన్నాడు మెగాస్టార్. ఈయ‌న తొలి సినిమా ప్రాణం ఖ‌రీదు విడుద‌లై నేటికి స‌రిగ్గా 40 ఏళ్లు గ‌డిచింది. ఇప్పుడు చిరు కెరీర్ 41వ ఏడాదిలోకి అడుగు పెడుతుంది. సెప్టెంబ‌ర్ 22, 1978లో విడుద‌లైంది ప్రాణం ఖ‌రీదు. కే వాసు తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని క్రాంతికుమార్ నిర్మించారు.

CHIRANJEEVI

అక్క‌డ్నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వ‌చ్చాడు చిరంజీవి. తెలుగు సినిమా చ‌రిత్ర‌ను మార్చిన హీరోలు చాలా మంది ఉన్నారు కానీ అందులో అంద‌రికంటే ముందు చెప్పుకోవాల్సిన వాళ్లు ఎన్టీఆర్.. ఏఎన్నార్. మ‌న తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచానికి చాటిచెప్పింది వీళ్లే.

ఇక వాళ్ల త‌ర్వాత ఆ స్థాయిలో మ‌న సినిమాను అన్ని ద‌శ‌ల‌కు తీసుకెళ్లింది చిరంజీవి. ఈయ‌న వ‌చ్చిన త‌ర్వాత తెలుగు సినిమాకు ఓ తెలియ‌ని క‌ల‌ర్ వ‌చ్చింది.. క‌ళ వ‌చ్చింది. తెలుగు సినిమా మార్కెట్ లెక్క‌లు మార్చిన ఘ‌న‌త ఈయ‌న‌కే సొంతం. టాలీవుడ్ కు తొలి 5.. 10.. 20.. 30 కోట్ల షేర్ కు బాట‌లు వేసిన హీరో ఈయ‌నే. అంతెందుకు బాహుబ‌లి కాకుండా 100 కోట్ల షేర్ సాధించిన తొలి హీరో కూడా చిరంజీవే. అస‌లు ఈయ‌న అలా తెర‌పై చిందేస్తుంటే అభిమానుల‌ మ‌దిలో ఏదో తెలియ‌ని సంబ‌రాలు.. గుండెల్లో తీన్ మార్ బీట్ వేసిన‌ట్లు కోలాహ‌లం.

ఇక అన్న‌య్య డైలాగులు చెప్తుంటే అదోర‌కం ఆనందం.. ఇలా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో కొలువై ఉన్న ఆరాధ్య న‌టుడు చిరంజీవి. సుప్రీమ్ హీరోగా మొద‌లై.. మెగాస్టార్ గా మారి.. ప‌ద్మ‌భూష‌ణుడిగా ఒదిగిపోయిన చ‌రిత్ర చిరంజీవి సొంతం. తెలుగు ఇండ‌స్ట్రీలో ఈయ‌న సాధించ‌ని రికార్డు అంటూ లేదు. అన్నింటినీ త‌న ఖాతాలో వేసుకుని ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 30 ఏళ్ల పాటు నెంబ‌ర్ వ‌న్ హీరోగా ఉన్నాడు మెగాస్టార్. చిరంజీవి సీన్ లో ఉన్నాడంటే మ‌రో హీరో క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌డు.. అంత మ‌కుటం లేని రాజ‌సం చిరంజీవిది. ప‌దేళ్ళ గ్యాప్ త‌ర్వాత వ‌చ్చి కూడా ఖైదీ నెం.150తో 100 కోట్ల విజ‌యం అందుకున్నాడు చిరంజీవి. అది మెగాస్టార్ స్టామినా అంటే. ఇప్పుడు కూడా సైరా అంటూ తెలుగు సినిమా స్థాయిని మ‌రో ఎత్తుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు ఈ హీరో. చిరు ప్రయాణం ఇలాగే కొన‌సాగాల‌ని అభిమానులంద‌రి త‌రుఫున ఆశిస్తున్నాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here