విన‌య విధేయ రామ తందానే తందానే..

రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు త‌ను చేస్తున్న‌ది ప‌క్కా మాస్ సినిమా కాదు.. అందులో ఫ్యామిలీ ఎమోష‌న్స్ కూడా ఉన్నాయ‌ని నిరూపించుకునే ప‌నిలో ప‌డ్డాడు. ఎందుకంటే ముందు విడుద‌లైన టీజ‌ర్ చూసిన త‌ర్వాత విన‌య విధేయ రామ‌లో అస‌లు ఫైట్లు త‌ప్ప ఇంకేమైనా ఉన్నాయా అనే డౌట్స్ వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాత మెల్ల‌గా త‌న‌ను తాను మార్చుకుంటున్నాడు బోయ‌పాటి శీను. ఈ చిత్రంలో మాస్ ఒక్క‌టే కాదు ఇంకా చాలానే ఉన్నాయ‌ని చెప్ప‌డానికి శాయ‌శక్తుల ప్ర‌య‌త్నిస్తున్నాడు.

Charan Latest Poster from VVR

ఇప్పుడు కూడా ఇదే చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. మొన్న‌టికి మొన్న కార్తిక పౌర్ణ‌మి స్పెష‌ల్ అంటూ దండం పెడుతున్న క్లాస్ ఫోటో విడుద‌ల చేసిన టీం.. ఇప్పుడు మ‌రోసారి అలాంటి క్లాస్ ఫోటోనే తీసుకొచ్చాడు. న‌లుగురు అమ్మాయిల‌తో చ‌ర‌ణ్ కూర్చుని న‌వ్వుకుంటున్న ఫోటో ఇప్పుడు విడుద‌లైంది. సినిమాలోని తందానే తందానే పాట డిసెంబ‌ర్ 3 సాయంత్రం 4 గంట‌ల‌కు విడుద‌ల కానుంది.

దీనికోస‌మే ఇప్పుడు అఫీషియ‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల చేసారు. ఈ చిత్రం గ్యాంగ్ లీడ‌ర్ ఆధారంగా తెర‌కెక్కుతుంద‌నే వార్త‌లు చాలాకాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఇందులో చ‌ర‌ణ్ అన్న‌య్య‌లుగా ప్ర‌శాంత్, ఆర్య‌న్ రాజేష్ న‌టిస్తున్నారు. టీజ‌ర్ చూసిన త‌ర్వాత మ‌ళ్లీ లెజెండ్ త‌ర‌హాలో రూల‌ర్ పాత్ర‌ను సృష్టించాడ‌ని అర్థ‌మైపోయింది. ఇక ఇప్పుడు సినిమాలో ఎమోష‌న్స్ ఎలా ఉంటాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. సినిమా సంక్రాంతికి విడుద‌ల కానుంది. అప్పుడు తెలుస్తుంది.. ఎమోష‌న్స్ రేంజ్ ఎలా ఉండ‌బోతుందో..?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here