అంబ‌రీష్ మ‌ర‌ణంపై ప్ర‌ముఖుల సంతాపం..

క‌న్న‌డ లెజెండ‌రీ న‌టుడు అంబ‌రీష్ మృతికి ప‌లువురు రాజ‌కీయ నేత‌లు.. సినిమా పెద్ద‌లు నివాళులు అర్పించారు. ఆయ‌న క‌న్నుమూయ‌డం తీర‌ని లోటు అని.. క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా కూడా ఆయ‌నే ముందుండి మ‌రీ దాన్ని ప‌రిష్క‌రించేవార‌ని అంబ‌రీష్ సాయాల‌ను గుర్తు చేసుకున్నారు. ఇక ఈయ‌న‌తో ఎప్పుడు ప్రాణంగా మెలిగే ముగ్గురు స్నేహితులు కూడా ఇప్పుడు క‌న్నీరు మున్నీరు పెడుతున్నారు. మ‌న ఇండ‌స్ట్రీ నుంచి చిరంజీవి బెంగ‌ళూర్ వెళ్లి అంబ‌రీష్ పార్థివ‌దేహానికి నివాళులు అర్పించారు.. ఈయ‌న‌కు సుమ‌ల‌త‌తో స్నేహం ఉంది. అలా అంబ‌రీష్ కూడా స్నేహితుడు అయ్యాడు.

Celebrities pays homage to ambareesh death
ఇక మోహ‌న్ బాబు అయితే త‌న ప్రాణంలో ప్రాణం అయిన అంబ‌రీష్ వెళ్లిపోవ‌డం న‌మ్మ‌లేక‌పోతున్నాన‌ని ట్వీట్ చేసాడు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ సైతం అంబ‌రీష్ కు నివాళి అర్పించారు. ఆయ‌న క‌న్నీరు పెట్టుకున్న సీన్స్ ఇప్పుడు అభిమానుల‌ను కూడా క‌లిచి వేస్తున్నాయి. క‌న్న‌డ‌నాటే కాదు.. అన్ని ఇండ‌స్ట్రీల్లోనూ ఈయ‌న‌కు స్నేహితులు ఉన్నారు. తెలుగు నుంచి మోహ‌న్ బాబు, చిరంజీవి.. క‌న్నడ నుంచి విష్ణువ‌ర్ధ‌న్.. హిందీలో శ‌త్రుఘ్న సిన్హా.. త‌మిళ‌నాట ర‌జినీకాంత్ ఇలా వాళ్లంతా ఎప్పుడూ క‌లిసే ఉండేవాళ్లు. ఇప్పుడు ఇందులోంచి విష్ణువ‌ర్ధ‌న్, అంబ‌రీష్ ఇద్ద‌రూ వెళ్లిపోయారు. మొత్తానికి స్నేహానికి ప్రాణమిచ్చే అంబ‌రీష్ ఇలా అర్ధాంత‌రంగా వెళ్లిపోవ‌డం మాత్రం అటు ఇండ‌స్ట్రీకి.. ఇటు అభిమానుల‌కు తీర‌నిలోటు అంటూ అంతా క‌న్నీరు పెట్టుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here