అల్లు అర్జున్ అన్న‌య్య నిర్మాత అవుతున్నాడుగా..

హీరోల కొడుకులు హీరోలు అవుతున్నారు.. అలాగే నిర్మాత‌ల కొడుకులు కూడా నిర్మాత‌లే అవుతారు అనుకుంటే పొర‌పాటే. ఇప్పుడు వాళ్లు కూడా హీరోలే అవుతున్నారు. కావాలంటే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ ను చూడండి. ఈయ‌న ఇద్ద‌రు కొడుకులు ఇప్పుడు హీరోల‌య్యారు.

alluarjun

అందులో అల్లు అర్జున్ టాప్ స్టార్ ఇప్పుడు. ఇక చిన్న‌బ్బాయి శిరీష్ కూడా ఎలాగోలా నెగ్గుకురావ‌డానికి చూస్తున్నాడు. కానీ ఈయ‌న‌కు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ విష‌యం చాలా త‌క్కువ మందికి తెలుసు. బ‌న్నీ, శిరీష్ ఎలాగూ న‌ట‌న ఎంచుకున్నారు కాబ‌ట్టి ఇప్పుడు పెద్ద కొడుకు బాబీ తండ్రి మాదిరే నిర్మాతగా మారుతున్నాడు. అల్లు అర‌వింద్ వార‌స‌త్వం తీసుకుంటున్నాడు. ఈయ‌న త‌న తొలి నిర్మాణంలో వ‌రుణ్ తేజ్ హీరోగా సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది.

ఇప్ప‌టికే కిర‌ణ్ అనే ద‌ర్శ‌కుడు రాసిన క‌థ వ‌రుణ్ తేజ్ కు వినిపించ‌డం.. అది ఆయ‌న‌కు కూడా న‌చ్చ‌డం జ‌రిగిపోయాయ‌ని తెలుస్తుంది. బాబీ త‌నొక్క‌డే కాకుండా త‌న బంధువు సిద్దుతో కలిసి కొత్త నిర్మాణ సంస్థ పెట్ట‌బోతున్నాడు. ఇందులోనే సినిమాలు నిర్మించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. అన్న‌ట్లు దీనికి బ‌న్నీ కూడా త‌న వంతు సాయం చేయ‌బోతున్నాడు. అయితే అది ఎలా ఉంటుంద‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. మొత్తానికి అన్న‌య్య‌తో ఏదో ఓ రోజు బ‌న్నీ కూడా సినిమా చేస్తాడేమో చూడాలిక‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here