బోయ‌పాటికి బాల‌య్య అన్ని కోట్లు ఇస్తున్నాడా..?

బాలకృష్ణ ఇప్పుడు హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా. వరుసగా ఎన్.బి.కె ఫిలిమ్స్ లో వ‌ర‌స‌గా సినిమాలు నిర్మిస్తున్నాడు. తన వారసుడు మోక్షజ్ఞను కూడా తన బ్యానర్ లోనే పరిచయం చేయాలనే ప్లాన్లో ఉన్నాడు ఈ హీరో. ఇప్ప‌టికే ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలను నిర్మించాడు బాలయ్య. ఇప్పుడు మూడో ప్రయత్నంగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Boyapati Next movie With Balayya

ఈ సినిమాపై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఈ చిత్రం షూటింగ్ మొద‌లు కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక సంచలన విషయం బయటికి వచ్చింది. బోయపాటి ఈ చిత్రం కోసం ఏకంగా 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్తలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. బాలయ్యే నిర్మాత కావడంతో పారితోషికంకు బదులుగా లాభాల్లో వాటా తీసుకోవాలని ఫిక్సయిపోయాడు బోయపాటి శ్రీను. ఇలా చేయడం వల్ల తనకు వచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా వస్తుందని ప్లాన్ చేశారు ఈ మాస్ డైరెక్టర్.

దానికి బాలయ్య కూడా ఓకే అన్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్స్ తో బాలయ్య బిజీగా ఉంటే.. వినయ విధేయ రామ‌ సినిమా ప్రమోషన్స్ తో బోయపాటి శ్రీను బిజీగా ఉన్నాడు. ఇద్దరి సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 7న మహానాయకుడు విడుదలైన తర్వాత బోయపాటి శ్రీను సినిమాపై దృష్టి పెట్టనున్నాడు బాలయ్య. ఏదేమైనా 15 కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం అయితే కాదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొరటాల శివ, రాజమౌళి, త్రివిక్ర‌మ్ లాంటి ద‌ర్శ‌కులు మాత్రమే ఇంత తీసుకుంటున్నారు. బోయపాటి కూడా ఆ లిస్ట్ లోకి అడుగు పెట్టేసాడు. సింహా, లెజెండ్ లాంటి సినిమాల తర్వాత బాలయ్యతో బోయపాటి తెరకెక్కించబోయే సినిమా ఇది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here