బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ మ‌ళ్లీ వ‌స్తున్నాడు.

ద‌రిద్రం నెత్తిమీద విళ‌య‌తాండ‌వం చేస్తున్న‌పుడు ఏం చేసినా సెట్ కాదు. పాపం బొమ్మ‌రిల్లు భాస్కర్ ప‌రిస్థితి కూడా అలాగే త‌యారైంది. తెలుగులో సంచ‌ల‌న సినిమాతో వ‌చ్చి ఆ త‌ర్వాత క‌నీసం క‌నిపించ‌కుండా పోయాడు ఈ ద‌ర్శ‌కుడు. బొమ్మ‌రిల్లు. ప‌రుగు సినిమాల‌తో త‌క్కువ టైమ్ లోనే స్టార్ డైరెక్ట‌ర్ అయిన ఈయ‌న‌.. ఒంగోల్ గిత్త‌, ఆరెంజ్ సినిమాల‌తో నేల మీదికి వ‌చ్చాడు.

Bommarrillu Bhaskhar Script for Venky

తెలుగులో ఎలాగూ అవ‌కాశాలు రావ‌ట్లేదు క‌దా అని త‌మిళ్ కి వెళ్లి అక్క‌డ బెంగ‌ళూర్ డేస్ రీమేక్ చేస్తే అది పోయింది. భాస్క‌ర్ చేసిన త‌ప్పో.. లేదంటే క‌థే క‌నెక్ట్ అవ్వ‌లేదో తెలియ‌దు గానీ బెంగ‌ళూర్ నాట్క‌ల్ త‌మిళ‌నాట డిజాస్ట‌ర్ గా నిలిచింది.
క‌థ‌ను హ్యాండిల్ చేయ‌డంలో.. ఎమోష‌న్ ను క్యారీ చేయ‌డంలో భాస్క‌ర్ ఫెయిల‌య్యాడంటూ ఆయ‌న్నే ఫుల్ గా ఎక్కేసారు కూడా. బొమ్మ‌రిల్లు సృష్టించిన సంచ‌ల‌నం చూసి చాలా ఏళ్ళ పాటు తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ డైరెక్ట‌ర్ గా చ‌క్రం తిప్పుతాడ‌నుకున్నారంతా.

కానీ ఏం చేస్తాం.. కాలం క‌లిసిరాలేదు. దాంతో భాస్క‌ర్ కాలం మారిపోయింది. ఇప్పుడు ఈయ‌న వెంక‌టేశ్ హీరోగా సినిమా చేస్తాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇవి న‌మ్మాలో లేదో కూడా అర్థం కావ‌డం లేదు. ఒక‌వేళ ఈ టైమ్ లో కానీ వెంక‌టేష్ ఆఫ‌ర్ ఇస్తే అంత‌కంటే అదృష్టం ఈ ద‌ర్శ‌కుడికి మ‌రోటి ఉండ‌దు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌బోతుందో..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *