భార‌తీయుడు 2లో ఎంత‌మంది ఉన్నారు శంక‌ర్.. 

ఇప్పుడు శంకర్ ను ఇదే ప్ర‌శ్న సూటిగా సుత్తి లేకుండా అడుగుతున్నారు అభిమానులు. అస‌లే మామూలు సినిమాల‌ను కూడా వంద‌ల కోట్ల‌తో తెర‌కెక్కించ‌డం ఈ ద‌ర్శ‌కుడికి అల‌వాటు అయిపోయింది. ఇప్పుడు క‌మ‌ల్ హాస‌న్ తో చేస్తున్న భార‌తీయుడు 2 కూడా అంతే. ఈ చిత్రం కూడా భారీ బ‌డ్జెట్ తోనే వ‌స్తుంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ దాదాపు 150 కోట్ల‌తో ఈ చిత్రం తెర‌కెక్కిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో చాలా మంది స్టార్స్ క‌నిపిస్తున్నారు. ఇప్ప‌టికే క‌మ‌ల్ ఉన్నాడు.. కాజ‌ల్ వ‌చ్చి చేరిపోయింది.. శింబు కూడా కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు.. దుల్క‌ర్ స‌ల్మాన్ ఒప్పుకున్నాడు. ఇక ఇప్పుడు అజ‌య్ దేవ్ గ‌న్ కూడా వ‌స్తున్నాడు.
Ajay Devgan
Ajay Devgan
2.0లో ర‌జినీకాంత్ కు విల‌న్ గా అంటే అక్ష‌య్ లాంటి స్టార్ హీరోను తీసుకొచ్చాడు శంక‌ర్. ఇప్పుడు మ‌రోసారి ఇదే చేయ‌బోతున్నాడు. ఈ సారి అజ‌య్ దేవ్ గ‌న్ వ‌స్తున్నాడు. క‌మ‌ల్ తో తెర‌కెక్కించ‌బోయే భార‌తీయుడు 2లో అజ‌య్ దేవ్ గన్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడు. ఈ విష‌యం క‌మ‌ల్ కూడా చెప్పాడు. అయితే ఈయ‌న న‌టించ‌బోయే కారెక్ట‌ర్ విల‌నా కాదా అనేది మాత్రం స‌స్పెన్స్. త్వ‌ర‌లోనే భార‌తీయుడు 2 ప‌ట్టాలెక్క‌నుంది.
మొత్తానికి బాలీవుడ్ హీరోల‌తో బంతాట ఆడేస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతుంది. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది ఈ చిత్రం. 20 ఏళ్ల కింద వ‌చ్చిన భార‌తీయుడు సినిమాకు ఇది సీక్వెల్. అయితే ఇప్ప‌టి రాజ‌కీయ ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లు క‌థ ఉంటుంది కానీ అప్ప‌టి క‌థ‌కు సంబంధం ఏదీ ఉండ‌ద‌ని చెబుతున్నాడు శంక‌ర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here