హ్యాపీ బ‌ర్త్ డే రాశీఖ‌న్నా..

హ్యాపీ బ‌ర్త్ డేలో హ్యాపీ ఉంది కానీ ఇప్పుడు రాశీఖ‌న్నా కెరీర్ నిజంగా హ్యాపీగా ఉందా అంటే లేద‌నే చెప్పాలి. ఎన్ని అవకాశాలు వ‌చ్చినా.. త‌ను ప్రూవ్ చేసుకున్నా కూడా విజ‌యం మాత్రం రావ‌డం లేదు ఈ భామ‌కు. ఈ మ‌ధ్య రాశీఖ‌న్నాకు ఒక్క హిట్ కూడా లేదు. తొలిప్రేమ త‌ర్వాత చేసిన సినిమాల‌న్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆశ‌లు పెట్టుకున్న శ్రీ‌నివాస క‌ళ్యాణం కూడా ముంచేసింది. దాంతో రాశీఖ‌న్నా ఇప్పుడు త‌న కెరీర్ గురించి మ‌రింత జాగ్ర‌త్త వ‌హిస్తుంది. ఇప్పుడు త‌మిళ సినిమాల‌తో పాటు తెలుగులోనూ న‌టిస్తుంది ఈ భామ‌.

Birthday Wishes to Rashi Khanna

తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, క్రాంతిమాధ‌వ్ సినిమాలో రాశీఖ‌న్నా ఓ హీరోయిన్. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మాయిని ఓ అగ్ర నిర్మాత కావాల‌నే ఇండ‌స్ట్రీలో బ్యాడ్ చేస్తున్నాడ‌ని తెలుస్తుంది. అంద‌రికీ ప‌ని గ‌ట్టుకుని ఫోన్ చేసి మ‌రీ.. రాశీకి అవ‌కాశాలు ఇవ్వొద్ద‌ని ఆర్డ‌ర్ వేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆ నిర్మాత‌తో ఈ మ‌ధ్యే ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ‌. అయితే ఈ సినిమాకు రెమ్యున‌రేష‌న్ భారీగా తీసుకోవ‌డం.. పైగా ఈ సినిమా కూడా ఫ్లాప్ అవ్వ‌డంతో ఆ కోపం ఎవ‌రిమీద చూపించాలో తెలియ‌క ఇప్పుడు రాశీ మీద ప‌డ్డాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఎలాగూ ఇండ‌స్ట్రీని ఏలుతున్న నిర్మాతే కాబ‌ట్టి క‌చ్చితంగా అంద‌రూ ఈయ‌న మాట వింటార‌నే అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు రాశీఖ‌న్నా కూడా త‌న సినిమాల‌ విష‌యంలో పెద్ద‌గా ప‌ట్టింపులు లేన‌ట్లు క‌నిపిస్తుంది. కారెక్ట‌ర్ న‌చ్చితే కావాలంటే పారితోషికం త‌గ్గించుకోడానికి రెడీ అంటుంది. ఎందుకంటే తొలిప్రేమ లాంటి హిట్ త‌ర్వాత శ్రీ‌నివాస క‌ళ్యాణంతో మ‌రో ఫ్లాప్ అందుకుంది ఈ భామ‌. దాంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టి మ‌ళ్లీ ఫామ్ లోకి రావాల‌ని చూస్తుంది. మ‌రి నిజంగానే ఈ భామ కెరీర్ ని ముగించ‌డానికి కుట్ర చేస్తున్నారేమో చూడాలిక‌..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here