హీరోగా భీమ‌వ‌రం బుల్లోడు.. రిస్క్ ఎందుకు సునీల్.

అవునా.. ఇప్పుడు మ‌ళ్లీ సునీల్ హీరోగా న‌టించ‌బోతున్నాడా..? ఈయ‌న మ‌రోసారి హీరో భారం త‌లెత్తుకుంటున్నాడా..? ఇన్ని రోజులు హీరోగా చేసి మొన్నీమ‌ధ్యే కామెడీ వైపు వ‌చ్చిన సునీల్ మ‌ళ్లీ హీరోగా మార‌బోతున్నాడా..? హీరోగా ఉన్న‌పుడు సినిమా భారం అంతా సునీలే మోయాలి. అది ఫ్లాప్ అయితే ఆ భారం అంతా ఈయ‌న నెత్తిపైనే ప‌డేది. ఆ భారం త‌ప్పించుకోడానికి క‌మెడియ‌న్ గా మారిపోయాడు.

Bhimavaram Bullodu Re Entry Next movie Hero

అయితే ఇప్పుడు మ‌ళ్లీ ఓ క‌థ న‌చ్చ‌డంతో మ‌ళ్లీ హీరో అవ్వాల‌ని చూస్తున్నాడు ఈ భీమ‌వ‌రం బుల్లోడు. ఇప్ప‌టికే అర‌వింద స‌మేత.. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ.. సిల్లీఫెలోస్ సినిమాల్లో క‌మెడియ‌న్ గా న‌టించాడు సునీల్. అయితే ఒక్క కారెక్ట‌ర్ కూడా పేల‌లేదు. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్ప‌టికీ అదే రేంజ్ పారితోషికం తీసుకుంటూ అద్బుతాలు చేస్తున్నాడు సునీల్.

అప్పుడెప్పుడో 2013లో పూల‌రంగ‌డితో వ‌చ్చిన విజ‌యం.. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. ఈ ఐదేళ్ల‌లో ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్ష‌కులు మాత్రం సునీల్ ను చూడ‌లేక‌పోయారు. దాంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్ గా ఎంట్రీ ఇస్తున్నాడు సునీల్. ఈ విష‌యంలో చాలా సీరియ‌స్ గా ఉన్న సునీల్.. రీ ఎంట్రీని మాత్రం ఘ‌నంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అజ్ఞాత‌వాసి మిస్సైనా.. ఎన్టీఆర్-త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాలో న‌టించాడు.

సాయిధ‌రంతేజ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించ‌బోయే చిత్ర‌ల‌హ‌రి.. బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా న‌టిస్తున్నాడు. దాంతోపాటు ప‌డిప‌డి లేచె మ‌న‌సులో ఉన్నాడు. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే వెలిగొండ శ్రీ‌నివాస్ చెప్పిన క‌థ న‌చ్చి మ‌రోసారి హీరోగా న‌టించ‌బోతున్నాడు సునీల్ అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్పుడు సునీల్ జ‌ర్నీ ఎలా ఉండ‌బోతుందో చూడాలిక‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *