మితిమీరిన అభిమానుల అత్యుత్సాహం.. నాగ‌బాబుకు శ్ర‌ద్ధాంజ‌లి..

ఇప్పుడు ఫ్యాన్స్ ఎలా ఉన్నారనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అభిమానం ముసుగులో వాళ్లేం చేస్తున్నారో కూడా తెలియ‌ని విచ‌క్ష‌ణ కోల్పోయి ప్ర‌వ‌ర్తిస్తున్నారు. బ‌తికి ఉన్న మ‌నిషిని చంపేయ‌డం కంటే దారుణం మ‌రోటి ఉండ‌దు. ఎంత కోపం ఉన్నా కూడా శ్ర‌ద్ధాంజ‌లి అని పెట్ట‌డం మాత్రం నీచమైన సంస్కృతి. ఇప్పుడు నాగ‌బాబు విష‌యంలో బాల‌య్య ఫ్యాన్స్ ఇదే చేసారు. ఆయ‌న ఏదో అన్నాడ‌ని వీళ్లు కూడా రెచ్చిపోయారు.

Bala krishna fans fire on naga babu

బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌దు అంటూ నాగ‌బాబు మాట్లాడిన మాట‌ల‌కు బాగా హ‌ర్ట్ అయిన అభిమానులు.. ఆయ‌న‌పై ఇలా ప‌గ తీర్చుకుంటున్నారు. మ‌రోవైపు ఫ్యాన్స్ ఇంత‌గా రియాక్ట్ అవుతున్నా కూడా నాగ‌బాబు వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ మ‌ళ్లీ అదే దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ ముందుకెళ్తున్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌పోర్ట్ లేకుండానే నాగ‌బాబు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారా అనేదిప్పుడు అంద‌ర్లోనూ వ‌స్తున్న అనుమానం. లేక‌పోతే ఏంటి.. ఎవ‌రి ధైర్యం చూసుకుని నాగ‌బాబు ఇంత‌గా మాట్లాడుతున్నాడు..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌చ్చితంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీ మెంబ‌ర్ అవుతాడు.. హంగ్ వ‌స్తే ప‌వ‌న్ కింగ్ అవుతాడు అనే ధైర్యంతోనే ఇప్పుడు నాగ‌బాబు త‌మ్ముడు త‌ర‌ఫున ఇలా మాట్లాడుతున్నాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇప్పుడు తిట్టిన వాళ్లే అప్పుడు త‌మ్ముడు ప‌వ‌న్ ద‌గ్గ‌రికి వ‌స్తార‌ని నాగ‌బాబు న‌మ్ముతున్నాడు. ఆ న‌మ్మ‌క‌మే ఇప్పుడు టీడిపి నాయ‌కుల‌ను.. బాల‌య్య లాంటి వాళ్ల‌ను కూడా లెక్క చేయ‌కుండా మాట్లాడిచ్చేలా చేస్తుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి చూడాలిక‌.. నాగ‌బాబు న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here