రాజ‌మౌళిని భ‌య‌పెట్టిన బాహుబ‌లి.. వ‌ణికిపోయాడంట పాపం..

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్క దర్శకున్ని భయపెట్టింది బాహుబలి. ఎందుకంటే ఆ సినిమా సృష్టించిన రికార్డులు అలా ఉన్నాయి మరి. దమ్ముంటే ఇలాంటి సినిమా ఒకటి తీసి చూపించండి అంటూ అందరికీ ఒకేసారి సవాల్ విసిరాడు రాజమౌళి. బాహుబలిని చూసి అంతా భయపడ్డారు.. ఇక రాజమౌళిని కూడా ఈ సినిమా భ‌య‌పెట్టింది అని తెలుసా..? అవును నమ్మడానికి కాస్త చిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం.

rajamouli

ఓ సమయంలో బాహుబలిని చూసి రాజమౌళి వణికిపోయాడు. ఈ ముచ్చట్లు అన్నీ కాఫీ విత్ కరణ్ షోలో అభిమానులతో పంచుకున్నాడు దర్శక ధీరుడు. అది బాహుబలి విడుదలైన తొలి రోజు.. అప్పుడే సినిమా టాక్ కూడా బయటకు వచ్చింది.. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా బాహుబలికి అద్భుతమైన టాక్ వచ్చింది.. అయినా కూడా తమ సంతోషంగా లేవని చెప్పాడు రాజమౌళి.

దానికి కారణం కీలకమైన తెలుగు రాష్ట్రాల్లో బాహుబలికి నెగిటివ్ టాక్ రావడమే. ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుందని కలలో కూడా ఊహించలేదని.. కానీ మార్నింగ్ షో తర్వాత ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకునేసరికి ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పాడు రాజమౌళి. ఆ టాక్ వినగానే వణికిపోయాన‌ని చెప్పాడు దర్శక ధీరుడు. అయితే రెండు రోజుల్లో అంతా సర్దుకుని సినిమా బ్లాక్ బస్టర్ అయిందని.. అప్పటి నుంచి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదని చెప్పాడు రాజమౌళి. ఆ తర్వాత బాహుబ‌లి సినిమా 500 కోట్లకు పైగా వసూలు చేయడం.. బాహుబలి 2 రావడం.. అది 1700 కోట్లకు పైగా వసూలు చేయడం.. ఇండియన్ సినిమా చరిత్రను మార్చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here