శింబు.. ఎంచుకున్న సినిమా ఏంటి.. చేసిన రీమేకేంటి..?

ఇప్పుడు ఈయ‌న్ని ఇలాగే అడ‌గాల‌నుకుంటున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు.. కాదు కాదు క‌డ‌గాల‌నుకుంటున్నారు. ఇండ‌స్ట్రీ హిట్ అయిన సినిమాను తీసుకెళ్లి అల్ల‌రి న‌రేష్ సినిమా మాదిరి కామెడీ చేసాడు ఈ హీరో. ఆయ‌న‌తో పాటు సుంద‌ర్ సి క‌లిసి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ను ఎమోష‌న‌ల్ అత్యాచార్ చేసారు. ఇప్పుడు అత్తారింటికి దారేది సినిమాను త‌మిళ‌నాట రీమేక్ చేస్తున్నారు. త‌న కెరీర్ లో ఎప్పుడూ త‌మిళ్ నుంచి ఇక్క‌డికి సినిమాలు తెచ్చుకోవ‌డ‌మే కానీ.. ఇక్క‌డ్నుంచి అక్క‌డ ప‌వ‌న్ సినిమాలు రీమేక్ అయిన సంద‌ర్భాలు అరుదు. అప్పుడెప్పుడో ఒక్క‌సారి మ‌న త‌మ్ముడు సినిమాను త‌మిళ్ లో బ‌ద్రిగా రీమేక్ చేసాడు విజ‌య్.

Attarintiki daredi tamil remake
ఆ త‌ర్వాత అన్నీ అక్క‌డ్నుంచి ఇక్క‌డికి వ‌చ్చిన క‌థలే. అయితే ఇప్పుడు చాలా ఏళ్ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా త‌మిళ్లో రీమేక్ అవుతుంది. ఇండ‌స్ట్రీ రికార్డులు తిర‌గ‌రాసిన అత్తారింటికి దారేది త‌మిళ్ లో వంత రాజ‌తాన్ వ‌రువేన్ పేరుతో రీమేక్ అవుతుంది. ఇప్ప‌టికే షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. ఇందులో ర‌మ్య‌కృష్ణ అత్త‌గా న‌టించింది. ఇక్క‌డ త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని అక్క‌డ సుంద‌ర్ తెర‌కెక్కిస్తున్నాడు. ఐదేళ్ల కిందే 80 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇప్పుడు త‌మిళ్ లో అక్క‌డ లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తుంది. మొత్తానికి అత్తారింటికి దారేది రీమేక్ టీజ‌ర్ చూసిన త‌ర్వాత సినిమాపై కూడా అనుమానాలు వ‌స్తున్నాయి. మేఘాఆకాశ్.. కేథ‌రిన్ థ్రెసా ఇందులో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here