అర‌వ అర్జున్ రెడ్డి అలా ఉన్నాడేంటి.. బాల చెడ‌గొట్టాడా..?

తెలుగులో అర్జున్ రెడ్డి ఓ ట్రెండ్ సెట్ట‌ర్. ఇలాంటి సినిమాను రీమేక్ చేయ‌డం అంటే క‌త్తి మీద సామే. ఏ మాత్రం తేడా జ‌రిగినా విమ‌ర్శ‌ల జ‌డిలో మునిగిపోవాల్సి వ‌స్తుంది. ఎందుకంటే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు. విమ‌ర్శ‌లు వ‌చ్చినా విజ‌యం కూడా అదే రేంజ్ లో వ‌చ్చింది. అర్జున్ రెడ్డి అనేది ఇప్పుడు పేరు కాదు.. అదో బ్రాండ్ అంతే. విజ‌య్ దేవ‌ర‌కొండ యాక్ష‌న్ ఈ సినిమాకు ప్రాణం.

ARJUN-REDDY-TAMIL-VERSION-VARMA-FIRST-LOOK

యావ‌రేజ్ సినిమాల‌నే రీమేక్ చేస్తుంటారు.. మ‌రి ఇంత‌టి సంచ‌ల‌నం సృష్టించిన సినిమాను మాత్రం ఎందుకు వ‌దిలేస్తారు. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. ఈ సినిమాను ఇటు త‌మిళ‌.. అటు హిందీ భాష‌ల్లో రీమేక్ చేస్తున్నారు. త‌మిళ్ అర్జున్ రెడ్డిగా విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ న‌టిస్తున్నాడు. అక్క‌డ ఈ సినిమాకు వ‌ర్మ అని పెట్టాడు ద‌ర్శ‌కుడు బాల‌.

ముందు ఈ చిత్ర త‌మిళ రీమేక్లో ముందు ధ‌నుష్ అనుక‌న్నా చివ‌రికి సీన్ లోకి విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ వ‌చ్చాడు. 23 ఏళ్ల ఈ కుర్రాడు అర్జున్ రెడ్డిగా మార‌డానికి చాలా ప్ర‌యత్నాలే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత సినిమాను చెడ‌గొడుతున్నారా అనే అనుమానం రాక మాన‌దు. ఫ‌స్ట్ లుక్ అస‌లేమాత్రం ఆక‌ట్టుకోలేదు. బైక్ పై ఉన్న ధృవ్ పిక్చ‌ర్ చూస్తుంటే అస్స‌లు న‌చ్చ‌డం లేదు ప్రేక్ష‌కుల‌కు. బాల సినిమాల్లో హీరోలు అందంగా ఉండ‌ర‌ని తెలుసు కానీ అర్జున్ రెడ్డి లాంటి సినిమాను కూడా ఇలా చూపిస్తే లేనిపోని తిప్ప‌లు రాక మాన‌వు. మొన్న‌టి వ‌ర‌కు ఈ సినిమాపై ఉన్న ఆస‌క్తి ఇప్పుడు లుక్ చూసిన త‌ర్వాత నీరు గారిపోతుంది.

పైగా ఈ సినిమా కోసం ధృవ్ ఇప్ప‌టికే గ‌డ్డం పెంచేసాడు.. ర‌ఫ్ లుక్ లోకి మారిపోయాడు.. అత‌డికి ఇప్పుడు అర్జున్ రెడ్డి బాగా పూనాడు. ధృవ్ ఈ రీమేక్ తోనే త‌మిళ ఇండ‌స్ట్రీకి అడుగు పెడుతున్నాడు. దీని షూటింగ్ పూర్త‌యింది ఇప్పుడు. అయితే ఇప్పుడు విడుద‌లైన లుక్ మాత్ర‌మే తేడాగా ఉంది. అర్జంట్ గా మ‌రో లుక్ విడుద‌ల చేయాల‌ని చూస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. మేఘా చౌద‌రి ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. అర్జున్ రెడ్డి రెగ్యుల‌ర్ సినిమా కాదు. ఇందులో చాలా డేరింగ్ సీన్స్ ఉన్నాయి. వాటిని త‌ట్టుకుని చేస్తే ధృవ్ కు మంచి ప్లాట్ ఫాం ప‌డిన‌ట్లే. మొత్తానికి తండ్రి మాదిరే తొలి సినిమాతోనే ఛాలెంజ్ లు తీసుకుంటున్నాడు ధృవ్ కృష్ణ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here