వ‌ర్మ టీజ‌ర్.. ట్రోలింగ్స్ తో చంపేస్తున్నారు..

అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ చేయాల‌నుకున్న‌పుడు ధృవ్ హీరో అన‌గానే అంద‌ర్లోనూ వ‌చ్చిన అనుమానం.. ఈ కారెక్ట‌ర్ కు స‌రిపోతాడా అని..? ఎందుకంటే ఈ పాత్ర చేయాలంటే చాలా మెచ్యూరిటీ కావాలి. కిడ్డీష్ గా ఉంటే చూడ‌టం క‌ష్టం. అప్పుడు వ‌చ్చిన అనుమానాలు ఇప్పుడు టీజ‌ర్ చూసిన త‌ర్వాత నిజ‌మే అనిపిస్తుంది.

న‌ట‌న ప‌రంగా ఎంత బాగా చేసినా కూడా ఎందుకో కానీ అర్జున్ రెడ్డి రీమేక్ ధృవ్ కు ప‌ర్ ఫెక్ట్ కాద‌ని అంచ‌నా వేస్తున్నారు అభిమానులు. ఇప్పుడు టీజ‌ర్ విడుద‌లైన త‌ర్వాత వ‌స్తున్న ట్రోలింగ్స్ కూడా ఇలాగే ఉన్నాయి. ఒక్క‌సారి టీజ‌ర్ చూస్తుంటేనే మ‌న‌కు అర్థ‌మైపోతుంది అస‌లు ఏ మాత్రం రిస్క్ తీసుకోకుండా అర్జున్ రెడ్డిని బాల ఎంత గుడ్డిగా ఫాలో అయిపోయాడో..? బాల లాంటి క్రియేటివ్ డైరెక్ట‌ర్ కూడా ఎలాంటి మార్పులు చేయ‌కుండా అర్జున్ రెడ్డిని దించేసాడు.

arjun reddy tamil remake varma dhruv debut

టీజ‌ర్ లో అచ్చంగా విజ‌య్ ఆటిట్యూడ్ దించేసాడు ధృవ్. అయితే త‌న మార్క్ మిస్ కాకుండా చూసుకున్నాడు కూడా. లిప్ లాక్ సీన్స్ కూడా చంపేసాడు. ఇప్ప‌టికే దీని షూటింగ్ పూర్త‌యింది. మేఘా చౌద‌రి ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. ఇక ఇప్పుడు టీజ‌ర్ చూసి ఎవ‌రికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాళ్లు ఆడేసుకుంటున్నారు.

త‌మిళ క‌మెడియ‌న్స్ అంతా క‌లిసి ఓ ట్రోల్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది టీజ‌ర్ అంటూ క‌మెంట్స్ చేస్తున్నారు. ఇదంతా చూసిన త‌ర్వాత విక్ర‌మ్ కూడా ఆలోచ‌న‌లో ప‌డుతున్నాడేమో మ‌రి.. ధృవ్ ను ఈ క‌థ కాకుండా మ‌రో క‌థ‌తో తీసుకొచ్చుంటే బాగుండు అని. అయినా ఇప్పుడు అనుకుని లాభం లేదు. మ‌రి చూడాలిక‌.. వ‌ర్మ‌తో ధృవ్ చేయ‌బోయే మాయ ఎలా ఉండ‌బోతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here