అర‌వింద స‌మేత ట్రైల‌ర్.. గొడ‌వ ఆపినోడే గొప్పోడు..

అజ్ఞాత‌వాసి త్రివిక్ర‌మ్ కెరీర్ కు పిట్టగోడ అయితే ప‌ర్లేదు.. కానీ కొండ. అంత పెద్ద షాక్ ఇచ్చింది ఈ సినిమా. కొండ‌ను ఎదురించాలంటే అంత‌కంటే పెద్ద కొండ‌ను తీసుకొచ్చి దానికంటే ఇది మంచి సినిమా అని నిరూపించుకోవాలి. ఇప్పుడు త్రివిక్ర‌మ్ ఇదే చేస్తున్నాడు. అర‌వింద స‌మేత‌తో మ‌రోసారి త‌న స‌త్తా చూపించాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోను ప‌ట్టుకుని అంతా మ‌రిచిపోయిన పగ‌లు ప్రతీకారాల‌ను మ‌ళ్లీ గుర్తు చేస్తున్నాడు ఈయ‌న‌.

Aravinda Sametha Veera Raghava Trailer

అజ్ఞాత‌వాసిని మ‌రిపించ‌డానికో లేదంటే తానే ఆ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా మ‌ర్చిపోవాల‌నుకుంటున్నాడో తెలియ‌దు కానీ ద‌స‌రాకు వ‌స్తున్నాడు ఈ సినిమాతో. విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే మాత్రం త్రివిక్ర‌మ్ పెద్ద‌గా కొత్త క‌థ అయితే ప‌ట్టుకోలేదు.. పూర్తిగా పాత తెలిసిన క‌థ‌నే మ‌ళ్లీ కొత్త‌గా చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. విడుద‌లైన క్ష‌ణం నుంచే సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతూ.. రికార్డ్ వ్యూస్ సాధిస్తుంది ఈ చిత్ర ట్రైల‌ర్.

ఇందులోనే క‌థ కూడా మొత్తం చెప్పేసాడు త్రివిక్ర‌మ్. ఇందులో ఫ్యాక్ష‌నిజం ఆపేయాల‌నేది హీరో క‌ల‌. దానికోసం ఆయ‌న చేసే పోరాటం ఈ చిత్ర క‌థ‌. రొటీన్ ఫ్యాక్ష‌న్ క‌థ‌నే మ‌ళ్లీ చేస్తున్నాడేమో అనిపించేంత రొటీన్ గా టీజ‌ర్ ను క‌ట్ చేయించినా.. ట్రైల‌ర్ విష‌యంలో మాత్రం కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు ద‌ర్శ‌కుడు. అందుకే త్రివిక్ర‌మ్ ఎప్పుడూ చేసిన త‌ప్పు చేయ‌డు. అందుకే అజ్ఞాత‌వాసి విష‌యంలో జ‌రిగిన ప్ర‌తీ చిన్న పొర‌పాట‌ను కూడా మ‌ళ్లీ స‌రిదిద్దుకునే ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న‌ విడుద‌ల కానుంది ఈ చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here