అర‌వింద స‌మేత 93 కోట్లంట‌.. జాగ్ర‌త్త త్రివిక్ర‌మ్..

ఇంకా వారం రోజులు.. స‌రిగ్గా వారం అంటే వారం రోజులు ఆగితే ఎన్టీఆర్ దూకుడు ఎంతో తెలిసిపోతుంది. అజ్ఞాత‌వాసి నుంచి త్రివిక్ర‌మ్ బ‌య‌టికి వ‌చ్చాడా లేదా అనేది తెలిసిపోతుంది. మ‌రోసారి ఎన్టీఆర్ బాక్సాఫీస్ రికార్డుల‌తో ఆడుకుంటాడా లేదా కూడా తెలిసిపోతుంది. అయితే ఎన్ని తెలిసినా ఒక్క విష‌యంలో మాత్రం అర‌వింద స‌మేతకు టెన్ష‌న్ త‌ప్ప‌డం లేదు. అదే బిజినెస్.. ఈ చిత్రాన్ని ఒక‌టి రెండు కాదు ఏకంగా 93 కోట్ల‌కు అమ్మేసారు.

ARAVINDA SAMETHA

ఇదే ఇప్పుడు అంద‌ర్నీ టెన్ష‌న్ పెడుతుంది. ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఒకేసారి అన్ని కోట్లు అంటే టెన్ష‌న్ కాక ఇంకేముంది..? 100 కోట్లు వ‌స్తే కానీ సినిమా హిట్ అనిపించుకోదు. అక్టోబర్ 11న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఈ హై బిజినెస్ కార‌ణంగానే భ‌ర‌త్ అనే నేనుకు 94 కోట్లు వ‌చ్చినా కూడా అబౌ యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.
గ‌తంలో ఎన్టీఆర్ జై ల‌వ‌కుశకు కూడా ఈ తిప్ప‌లు త‌ప్ప‌లేదు. ఈ చిత్రం 75 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసినా యావ‌రేజ్ గానే నిలిచింది. దానికి కార‌ణం కూడా భారీ బిజినెస్సే.

ఇప్పుడు అర‌వింద స‌మేతకు ఇదే జ‌రుగుతుందేమో అని భ‌యంలో ఉన్నారు బ‌య్య‌ర్లు. ద‌స‌రా హాలీడేస్ ఉన్నాయి కాబ‌ట్టి కాస్త బాగున్నా కూడా సినిమాకు జ‌నాలు పోటెత్త‌డం ఖాయం. పైగా ఇప్పుడు సెంటిమెంట్ కూడా న‌డుస్తుంది ఈ సినిమాపై. తండ్రి సెంటిమెంట్ కూడా ఉంద‌ని తెలుస్తుంది. అన్నింటికీ మించి ఎన్టీఆర్ ఇప్పుడు వ‌ర‌స విజ‌యాల‌తో దూసుకుపోతున్నాడు. దాంతో క‌చ్చితంగా అర‌వింద స‌మేత జ‌రిగిన బిజినెస్ తో పాటు లాభాలు కూడా తీసుకొస్తుంద‌ని న‌మ్ముతున్నారు నిర్మాత‌లు. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here